ఎస్సి ఎస్టీ లకు నేనున్నానంటూ ముందుకు వచ్చిన చెన్ను

పేదల పెన్నిధి...


ఎస్సి ఎస్టీ లకు నేనున్నానంటూ ముందుకు వచ్చిన చెన్ను....


ఏడు వేల ఎస్సి ఎస్టీ కుటుంబాలకు చేయూత..


     రాపురు:        నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చెన్ను బాలకృష్ణా రెడ్డి పేదల ఆకలి తీర్చేందుకు నేనున్నానంటూ ముందుకు వచ్చారు. వంద రెండు వందలు కాదు ఏకంగా ఏడు వేల ఎస్సి ఎస్టీ కుటుంబాలకు నెల రోజులకు సరి పడా నిత్యావసరాలు పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చేందుకు నేనున్నానంటూ ధైర్యం కల్పిస్యున్నారు.లాక్ డౌన్ కారణంగా ఏ పేద కడుపు ఆకలికి అలమతించకూడదు అనే దృఢ సంకల్పంతో పేదల ఆకలి తీరుస్తున్నారు. యాభై  లక్షల రూపాయల సొంత నిదులు  వెచ్చించి తన సొంత మండలమైన రాపూరు లోని 21 పంచాయితీ ల్లోని ఏడు వేల ఎస్సి, ఎస్టీ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ పేదలకు భరోసా కల్పిస్తున్నారు.ఇప్పటికే మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన చెన్ను మరో సారి పేదల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.