పోలీసులకు పీపీఈ కిట్లు కొనుగోలు కోసం ప్రభుత్వం 2.89 కోట్లు మంజూరు :డి.జి.పి

అనంతపురం పర్యటనలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటన విశేషాలు :


కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కు కృతజ్ఞతలు.బాధిత కుటుంబానికి చెక్ అందజేశాం.దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానిదే.కరోనా కష్టకాలంలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వారికి సలాం.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు.కాంటాక్ట్ వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తున్నాం.ఏపీకి 28000 మంది విదేశాల నుండి, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారు, అందర్నీ గుర్తించి క్వారంటెన్ లో ఉంచాం.దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదే.వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం.అన్ని శాఖలతో పోలీసులు సమన్వయం చేసుకుంటు ముందుకుసాగుతున్నాము.పోలీసులకు పీపీఈ కిట్లు కొనుగోలు కోసం ప్రభుత్వం 2.89 కోట్లు మంజూరు చేసింది