గ్రామాలు, పట్టణాల్లో 20వేలకు పైగా వైయస్సార్‌ జనతాబజార్లు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*13–04–2020*
*అమరావతి*


*మన రైతులకు అందుబాటులో అతిపెద్ద స్థానిక మార్కెట్‌
*గ్రామాలు, పట్టణాల్లో 20వేలకు పైగా వైయస్సార్‌ జనతాబజార్లు*
*ఆ దిశగా ప్రభుత్వం అడుగులు* 


*అమరావతి:* 
*వైయస్సార్‌ జనతా బజార్ల ప్రతిపాదనలపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ చర్చ*
వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాససింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసేదిశగా ప్రభుత్వం అడుగులు
ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రతిపాదనలను సమావేశంలో చర్చించిన సీఎం


రాష్ట్రంలో 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి:సీఎం
వీటిలో వైయస్సార్‌ జనతా బజార్లు పెట్టేదిశగా ప్రయత్నాలు చేయాలి: సీఎం
వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలి:
మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలి:
దాదాపుగా 22వేల జనతాబజార్లతో పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది:
ఈ బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలి:
పాలు, పళ్లు, కూరగాయలు తదితర వాటిని నిల్వచేసి విక్రయానికి  అందుబాటులో పెట్టాలి:
వీటివద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్‌ వ్యాన్స్‌ కూడా పెట్టాలి:
ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు ఉండాలి:
ప్రతిరోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి:
మరోవైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు లేదా దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఈ వాహనాలు ఉపయోగపడతాయి:
జనతాబజార్లకు సంబంధించి మ్యాపింగ్‌ చేయాలి:
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైతుజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించారు
ప్రతి నిత్యావసర వస్తువును దాదాపుగా ప్రతిగడప వద్దకూ చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు
పెద్ద ఎత్తున మార్కెట్‌ అవకాశాలు కరోనా ఎదుర్కోవడం రూపంలో మనకు అందుబాటులోకి వచ్చింది
ఈ లొకేషన్లను కూడా గుర్తించి ఆమేరకు అక్కడ కూడా జనతా బజార్లు వచ్చేలా చేయండి
రైతులకు మార్కెటింగ్‌ పరంగా ఇబ్బందులు రాకుండా తొలగిపోతాయి
లాభ, నష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే.. ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయి
ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడుపోతాయి
ప్రతి నియోజకవర్గానికీ కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేసేదిశగా ప్రయత్నాలు చేయాలి:
జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాలి:
రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుంది:
మార్కెట్లో జోక్యంచేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది:
తద్వారా, రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది:
ఇది సక్రమంగా చేయగలిగితే.. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది:
గ్రామాల స్వరూపాలు మారిపోతాయి :
అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలి:
గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుంది:
ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్‌ షిప్‌ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలి:
వైయస్సార్‌ జనతాబజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించండి


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image