టెలిమెడిషన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24గంటలు లోగా మందులు అందించాలి

టెలిమెడిషన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24గంటలు లోగా మందులు అందించాలి
* ఆరోగ్య సేతు యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి
* ఇంటింట సర్వేలో కరోనా లక్షణాలు గుర్తించిన వారందరకీ టెస్టులు పూర్తి చేయండి
* జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశం
అమరావతి: టెలిమెడిషన్ విధానం కింద డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటలు లోగా సంబంధిత వ్యక్తులకు మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై మంగళవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ఇటీవల ప్రారంభించిన టెలిమెడిషన్ విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని  కావున ఈవిధానం ద్వారా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24గంటల్లోగా సంబంధిత వ్యక్తులకు మందులు అందేలా చూడాలని స్పష్టం చేశారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు,ఇతర ఆసుపత్రుల్లో ఓపిక కేసులను తగ్గించేందుకు ఈటెలిమెడిషన్ విధానం ఎంతో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆంతేగాక రానున్న రోజుల్లో ఈ టెలిమెడిషన్ విధానం ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తరచూ ఆరోగ్య సేతు యాప్ ఆవశ్యకతను తెలియజేస్తున్నారని కావున దీని ఆవశ్యకతను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈయాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీనిపై జిఓ కూడా జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటింట సర్వేలో గుర్తించిన వారికందరికీ టెస్టులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుతున్నాయని ఆలాగే గ్రీన్ జోన్ లలో గల పరిశ్రమలన్నీ ప్రారంభం అయ్యేలా చూడాలని సిఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. అదేవిధంగా మే 3 తర్వాత కంటైన్మెంట్ ప్రాంతాల్లో అనుసరించాల్సిన విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స‌మావేశంలో  విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా పాజిటివ్, నెగిటివ్ కేసులను సక్రమంగా పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే ఆసుపత్రుల సన్నద్ధం చేయడంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెత్ ఆడిట్ పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆవివరాలు జిల్లా కలెక్టర్లుకు పంపనున్నట్టు చెప్పారు.
వీడియో సమావేశంలో సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image