చరిత్రలో ఈ రోజు ఏప్రియల్ 25

*చరిత్రలో ఈ రోజు ఏప్రియల్ 25*


 *🌺సంఘటనలు🌺* 


2007: నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాసఅగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు.


2011: 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు.


 *🌷జననాలు🌷* 


1874: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ. 1937)


1900: వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1958)


 *🍁మరణాలు🍁* 


68: మార్క్ ద ఎవాంజెలిస్ట్, అలెగ్జాండ్రియా లోని మొదటి పోప్, అలెగ్జాండ్రియా చర్చి స్థాపకుడు.


1744: అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701)


1984: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (జ.1906)


1992: వసంతరావు వేంకటరావు, ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.


2005: స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు. (జ.1908)


2005: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి (జ.1925)


2018: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు (జ.1950)


 *🌼జాతీయ దినాలు🌼* 


** ప్రపంచ మలేరియా దినోత్సవం.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..