చరిత్రలో ఈ రోజు  - ఏప్రిల్, 28 - సంఘటనలు

చరిత్రలో ఈ రోజు  - ఏప్రిల్, 28 - సంఘటనలు


2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.


జననాలు
1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
1871: కాళ్ళకూరి నారాయణరావు, సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)
1897: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు, నాటక కర్త. (మ.1958)
1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
1942: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.
1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.


మరణాలు 
1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700)
1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)
1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939)


పండుగలు , జాతీయ దినాలు
- ప్రపంచ పశు వైద్య దినోత్సవం
- ప్రపంచ భద్రతా దినం.
- ఒడిషాలో లాయర్స్ దినం.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image