ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండడమే అసలైన దేశ సేవ :మేకపాటి గౌతమ్ రెడ్డి


తేదీ : 05-04-2020,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.


*సంక్షోభాల నుంచి సమాజాన్ని రక్షించిన మాజీ భారత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్  నేటికీ ఆదర్శం : పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, ఆయన బాటలోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్


కరోనాను నివారించడంలో  బాబూ జగ్జీవన్ రామ్ దార్శనికతే మనకందరికీ స్ఫూర్తి


భారత్ - పాక్ యుద్ధ సమయంలో అన్నం లేక అల్లాడుతున్న దేశంలో హరిత విప్లవానికి నాంది


ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం..ఆకలి బాధ నుంచి గట్టెక్కించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం


కరోనా విజృంభిస్తున్న పరిస్థితులలో ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండడమే అసలైన దేశ సేవ



శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఏప్రిల్, 05 ; దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో..నాడు  భారత్ - పాక్ మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దేశంలో ఆకలి కేకలు లేకుండా చేసిన బాబూ జగ్జీవన్ రామ్ ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ 5న  బాబూ జగ్జీవన్ రామ్  113వ జయంతి సందర్భంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని మంత్రి మేకపాటి  స్పష్టం చేశారు.  హరిత విప్లవానికి నాంది పలికి ఆహార కొరతను తీర్చిన దార్శనిక నాయకుడు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను మంత్రి మేకపాటి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జగ్జీవన్ రామ్ బాటలోనే నడుస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ -19 వైరస్ నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం.. ఆకలి బాధ నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కుల వివక్షను ఎదిరించి సమసమాజాన్ని నిర్మాణానికి కృషి చేసిన జగ్జీవన్ రామ్ లాగే జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలు చూడకుండా ప్రజలకు మంచి పాలన అందిస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.