మే 3 నాటికి ఏపీలో కరోనా కేసులు 2,000కి పెరిగే అవకాశం : యనమల

మే 3 నాటికి ఏపీలో కరోనా కేసులు 2,000కి పెరిగే అవకాశం : యనమల
విజయవాడ : కేంద్ర అధికారుల బృందం రాష్ట్రానికి వస్తోంది
ఆ బృందాన్ని కలుస్తాం
వైసీపీ ప్రభుత్వం కరోనాను తేలిగ్గా తీసుకుందని ఫిర్యాదు చేస్తాం
వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజు భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇలాగే కరోనా కేసులు పెరిగితే మే 3 నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,000కు చేరతాయని తెలిపారు. కేంద్ర అధికారుల బృందంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిశీలించేందుకు రెండు రోజుల్లో ఏపీకి వస్తుందని గుర్తు చేశారు.
తాము కేంద్ర అధికారుల బృందాన్ని కలుస్తామని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని వారికి ఫిర్యాదు చేస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారని తాము ఫిర్యాదు చేస్తామని అన్నారు. కరోనా కేసులు పెరిగితే ఇన్‌ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాపై సరైన లెక్కలు చెప్పాలన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image