చరిత్రలో ఈ రోజు -..ఏప్రిల్, 30

చరిత్రలో ఈ రోజు -..ఏప్రిల్, 30


సంఘటనలు
1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది.
1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.


జననాలు
1777: కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855)
1870: దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944)
1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు.
1901: సైమన్ కుజ్‌నెట్స్, ఆర్థికవేత్త .
1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011)
1968: దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు.
1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.


మరణాలు 
1030: మొహమ్మద్ ఘజనీ, ఘజనీ సామ్రాజ్య పాలకుడు. (జ. 971)
1945: అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ నియంత (జ.1889)
1957: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (జ.1888)
1975: కేదారిశ్వర్ బెనర్జీ, సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (జ.1900)
1979: అబ్బూరి రామకృష్ణారావు, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది.
1983: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (జ.1922)
2011: దోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1955)
2017: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870)
2017: దూసి ధర్మారావు, తెలుగుకవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘసేవకుడు.
2019: ఎస్. పి. వై. రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త (జ.1950)


పండుగలు , జాతీయ దినాలు 
- బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.