వింజమూరులో 30 మందికి రోడ్డుపై కౌన్సిలింగ్

వింజమూరులో 30 మందికి రోడ్డుపై కౌన్సిలింగ్


వింజమూరు, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): విచ్చలవిడిగా రోడ్లు మీదకు వస్తారా...రేపటి నుండి పనీపాటా లేకుండా రోడ్లు మీద సంచరిస్తారా...ఒకవేళ వస్తే ఏం చెయ్యమంటారు చెప్పండి అంటూ వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి ప్రశ్నిస్తుండగా రోడ్లు మీదకు రాము సార్, వస్తే శిక్షించండి అంటూ పలువురు యువకులు ప్రాదేయపడిన సంఘటన మంగళవారం నాడు వింజమూరులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గత రెండు రోజుల క్రితం వింజమూరుకు సమీపంలోని కొండాపురం మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో వింజమూరులో అధికారులు అప్రమత్తమయ్యారు. వింజమూరు పరిసర ప్రాంతాల నుండి ఏ ఒక్కరూ వింజమూరులోకి రాకూడదని ఆం క్షలు విధించారు. అలాంటి తరుణంలో వింజమూరులో విచ్చలవిడిగా తిరిగే వారికి సరైన గుణపాఠం చెప్పే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. పలువురిని ఎక్కడికక్కడ నిలిపివేసి రోడ్డుపైనే కూర్చోబెట్టారు. లాక్ డౌన్ ముగిసే వరకూ రోడ్లు మీదకు రాబోమంటూ ప్రతిజ్ఞలు చేయించారు. ఈ కార్యక్రమంలో తహసిల్ధారు సుధాకర్ రావు కూడా పాల్గొని యువకుల చేత ఇక మీదట విచ్చలవిడిగా రోడ్లు మీద తిరగబోమని ప్రమాణాలు చేయించారు.