అనంతపురం ప్రెస్ క్లబ్ లో 300 మంది జర్నలిస్టులకు కాయగూరలు పంపిణీ చేసిన డాక్టర్ శైలజనాథ్

జర్నలిస్టులను  ప్రభుత్వం ఆదుకోవాలి. : మచ్చా రామలింగారెడ్డి


డాక్టర్ శైలజానాథ్ పిసిసి అధ్యక్షులు,మాజీ మంత్రి డిమాండ్.


అనంతపురం:   ఏప్రిల్,12(అంతిమ తీర్పు) :               ప్రెస్ క్లబ్ లో 300 మంది జర్నలిస్టులకు కాయగూరలు పంపిణీ చేసిన డాక్టర్ శైలజనాథ్.
----------------------------------------------


✍కరోనా వల్ల ఇబ్బందిపడుతున్న రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందర్నీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆర్థిక సాయం చేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డాక్టర్ శైలజానాథ్ పిసిసి అధ్యక్షులు డిమాండ్ చేశారు.


✍జర్నలిస్టులు కష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకోవడం మా బాధ్యత ధర్మమని అందుకే ఈ చిన్న పంపిణీ కార్యక్రమం అని  శైలజానాథ్ అన్నారు జర్నలిస్టు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కరోనా వార్తలు ఇస్తున్నారని వారి సేవలను గుర్తించాల్సిన సమయం ఇది అన్నారు.


✍అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం నగరంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కాయగూరలు పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శైలజానాథ్ పిసిసి అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, నగర అధ్యక్షులు దాదా గాంధీ, మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, సీనియర్ జర్నలిస్టులు రామాంజనేయులు, భోగేశ్వరరెడ్డి, రామాంజనేయులు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు మారుతి, హరికృష్ణ, జిలాన్, కృష్ణ. జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శివప్రసాద్, తేజ ప్రసాద్, జమ్ముల రమేష్ రెడ్డి, ఆంధ్రప్రభ ఇంచార్జ్ రాజా, ఆదినారాయణ, దిలీప్, నాగేంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


✍మచ్చా రామలింగారెడ్డి (జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే కాయగూరలను పంపిణీ చేసిన పిసిసి అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్, డిసిసి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, వర్కింగ్ జర్నలిస్టు తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని వారి సహకారాన్ని జర్నలిస్టు ఎప్పుడు గుర్తుంచుకుంటారు అని మచ్చా రామలింగారెడ్డి అన్నారు


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎