సున్నా వడ్డీ పథకం పొదుపు మహిళలకు వరం :మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి

సున్నా వడ్డీ పథకం పొదుపు మహిళలకు వరం
మంత్రాలయం,ఏప్రిల్,24 (అంతిమతీర్పు):-కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని పొదుపు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం మహిళలకు వరమని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ 3 లక్షల అప్పు ఉండి ప్రతి నెలా వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్న డ్వాక్రాపొదుపు గ్రూపు  సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలు అవుతుందన్నారు. నియోజకవర్గంలోని మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల్లోని 4,823 గ్రూపులకు గాను 3,421 గ్రూపులకు రూ 5.43 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాధి నివారణ చర్యల్లో ముఖ్యంగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు నియోజకవర్గ వైఎస్సార్ బీమా పథకం కింద 19 మందికి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వెలుగు తరుపున ప్రత్యేకంగా తయారుచేసిన మాస్క్ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీపురెడ్డి, మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మాధవరం రామిరెడ్డి, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, కోసిగి మహాంతేష్ స్వామి, లక్ష్మి నారాయణ రెడ్డి, ఏపిఎం జయశ్రీ, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ ఎర్రన్న, మాజీ సర్పంచ్ టి.భీమయ్య తదితరులు ఉన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..