వాలంటీర్ల పోస్టుల ఇంటర్వూలకు 36 మంది హాజరు

వాలంటీర్ల పోస్టుల ఇంటర్వూలకు 36 మంది హాజరు


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండల కేంద్రంలోని మూడు సచివాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 8 వాలంటీర్లు పోస్టులకు బుధవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వూలు జరిగాయి. ఈ 8 పోస్టులకు గానూ మొత్తం 49 మంది అభ్యర్ధులు అన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే బుధవారం నాడు జరిగిన ఇంటర్వూలకు 36 మంది మాత్రమే హాజరైనట్లు అధికారులు తెలిపారు. య..పి.డి.ఓ కనకదుర్గా భవానీ నేతృత్వంలో జరిగిన ఈ ఇంటర్వూలలో అభ్యర్ధులకు స్థానిక భౌగోళిక పరిస్థితులు, విధ్యార్హత, సామాజిక సృహ, ప్రభుత్వ పధకాల పట్ల అవగాహన తదితరాలపై ప్రశ్నలు వేశారు. ఈ ఇంటర్వూలలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.