4వ విడతలో ప్రతి ఇంటింటి సర్వే కార్యక్రమం ఎలా చేపట్టాలి అనే దాని పై డిఎంహెచ్ఓ లు, డిసిహెచ్ఎస్ లు, పి హెచ్ సి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్


చిత్తూరు, ఏప్రిల్ 29: ఆరోగ్యంగా ఉన్నా, అలాగే అనారోగ్యంగా ఉన్నా ఇంటిలోని ప్రతి ఒక్కరినీ వాలంటీర్లు, ఆశాలు వెళ్ళి సర్వే చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కె. భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో వెలగపూడి నుండి మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా 4వ విడతలో ప్రతి ఇంటింటి సర్వే కార్యక్రమం ఎలా చేపట్టాలి అనే దాని పై డిఎంహెచ్ఓ లు, డిసిహెచ్ఎస్ లు, పి హెచ్ సి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ మాట్లాడుతూ ఏ ఇంటి వద్ద సర్వే కు సంబంధించిన సమాచారం ను సేకరిస్తున్నారో అక్కడ నుండే విలేజ్ వాలంటీర్ యాప్ నుండి జి పి ఎస్ ద్వారా వివరాలను అప్ లోడ్ చేయాలన్నారు. ఇది వరకు వాలంటీర్ సర్వే లో మిగిలిన వ్యక్తులను మరియు జబ్బులకు తొందరగా గురి కాబడే వ్యక్తులు, గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లలు, ముసలి వారు అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు పొందుతున్న వారిని తప్పక గుర్తించాలని చెప్పారు. ఏ వ్యక్తి అయినా కరోనా లక్షణాలు ఉన్నాయనే స్వచ్ఛంధంగా ముందుకు వస్తే అటువంటి వారు 104 కు ఫోన్ చేయాలని, ఈ సమాచారం కాల్ సెంటర్ ద్వారా సంబంధిత వైద్యాధికారికి వెళుతుందని, ఆ వైద్యాధికారి వారిని సందర్శించి అవసరమైన వైద్య సహాయం సత్వరం అందిస్తారన్నారు. సర్వే కి వెళ్ళిన బృంద సభ్యులు ఇంటిలోని వ్యక్తుల యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ నందు ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేయించాలని ఆదేశించారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తుల యొక్క ఇండ్ల యందు స్వీయ నిర్భందంలో ఉండుటకు అంగీకరించిన వారికి అనుకూలాలు ఉన్నచో అట్టి వారిని ఇంటి వద్దే ఉంచి వైద్య సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. అరుణ కుమారి మాట్లాడుతూ ప్రతి రోజు వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల యొక్క వివరములను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని తద్వారా క్లస్టర్ మ్యాపింగ్, కంటైన్మెంట్ జోన్ ఏరియా మ్యాపింగ్ చేయుటకు వీలవుతుందన్నారు. 
 ఈ కార్యక్రమం లో డిసిహెచ్ఎస్ డా. సరళమ్మ, డిఎస్ఓ డా. సుధర్శన్, డిపిఎంఓ డా. శ్రీనివాస్, డిప్యూటీ డెమో శాంతమ్మ, హెచ్ ఇ కృష్ణా రెడ్డి, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, ఎస్ ఓ రమేశ్ రెడ్డి, జిల్లాల పరిధిలోని పి హెచ్ సి వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.       
ర్త్రుుుుుుుుుుు