ఇప్పటి వరకు 405 పాజిటివ్‌ కేసులు:

*11.04.2020*
*అమరావతి*


*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం*


*రాష్ట్ర వ్యాప్తంగా కొసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌*   


*ఇప్పటి వరకు 405 పాజిటివ్‌ కేసులు:
 రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలలో కొత్తగా 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒక్కరోజే అత్యధికంగా 17 కేసులు నమోదు కాగా, కర్నూలులో 5, ప్రకాశం, వైయస్సార్‌ కడప జిల్లాలలో ఒక్కో కేసును గుర్తించారు.
 దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 405 కి చేరింది. 
 కర్నూలు జిల్లాలో ఇప్పటికీ అత్యధికంగా 82 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 75, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్‌ కడప జిల్లాలో 30, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో 20 చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.
 కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 11 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 4గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
 వివిధ ఆస్పత్రులలో 388 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. అనంతపురం, కృష్ణా జిల్లాలలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొకరు చనిపోయారు.
 ఇంకా 13 జిల్లాలలో మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించి, ఆయా చోట్ల రాకపోకలు నిషేధించడంతో పాటు, వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.


*ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*
– లాక్‌డౌన్‌పై ప్రధానితో తన అభిప్రాయాలను పంచుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. 
రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం: సీఎం
అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాం: సీఎం రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న  కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం: సీఎం
కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి,  వారికి వైద్యం అందిస్తున్నాం:
ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40 వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు:
కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3 వేల మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు:
అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది:
లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం:
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం:
క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నాం. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాం:
సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం. వాటిలో 26 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి:


*వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌ బోట్‌లను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*:


కోవిడ్‌–19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు ఉద్దేశించిన వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌ బోట్‌లను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు.


*ఇక జిల్లాల వారీగా వివరాలు:*


*శ్రీకాకుళం జిల్లా:*


జిల్లాలో కోవిడ్‌–19 నమూనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. జిల్లాలో 20 టిబి పరీక్షల నిర్వహణ కేంద్రాలు ఉన్నాయని వాటిలో కరోనా పరీక్షలకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఈనెల 15 నుంచి సామాజిక ఆస్పత్రుల్లో కోవిడ్‌ కియాస్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా మొబైల్‌ æ కియాస్కులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వాటితో పాటు, రాపిడ్‌ టెస్టింగు కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ వెల్లడించారు.
 జిల్లాలో మూడవ దశ సర్వే దాదాపు పూర్తి కావచ్చిందని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. సర్వేలో 4 వేల మందిలో జ్వరం లక్షణాలు గుర్తించగా, వారిలో 1248 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచామని,  28 మందికి పరీక్షలు చేయాలని వైద్య అధికారుల సూచనల మేరకు నమూనాలను తీయుటకు నిర్ణయించామని చెప్పారు. వ్యాధిగ్రస్తులను తరలించుటకు ప్రత్యేక వాహనాలను సి.హెచ్‌.సి, తహశీల్దార్‌ పరిధిలో పెట్టామని అన్నారు. కరోనా లక్షణాలుగల వారిని తీసుకువెళ్ళుటకు ముందు, తరువాత వాహనాలను సోడియం హైపోక్లోరైడ్‌ తో శుభ్రపరచడం జరుగుతుందని పేర్కొన్నారు.
  జిల్లాలో 2 వేల పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలను ఐదు ప్రదేశాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, అందుకు టెండర్లు కూడా పిలిచామని కలెక్టర్‌ జె.నివాస్‌ వెల్లడించారు. జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి జెమ్స్‌లో అన్ని సిద్ధం చేశామని, మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. 
జిల్లాలో లాక్‌ డౌన్‌ ప్రభావంతో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని సంకల్పించామని, అందుకే అక్షయపాత్ర ద్వారా శనివారం నుంచి 3 వేల మందికి ఇంటి వద్దనే ఆహారం అందించే ఏర్పాట్లు రెవిన్యూ శాఖ ద్వారా  చేశామని, రెడ్‌ క్రాస్, ఇతర స్వచ్చంద సంస్ధల ద్వారా 2 వేల మందికి ఆహారం అందించే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కరోనా పునరావాస కేంద్రాల్లో 1000 మందికి, క్వారంటైన్‌లో ఉన్న 669 మందికి ఆహార ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ వివరించారు.


*విజయనగరం జిల్లా:*


 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి «ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌  జిల్లాలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, హోం గార్డులకు నిత్యావసర  సరకులు అందజేసింది. అయిదు రకాల సరుకులను జిల్లా కలెక్టర్‌ డా.హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్‌.పి రాజకుమారితో కలిసి వైయస్సార్‌సీపీ నేత మజ్జి  శ్రీనివాసరావు వారికి పంపిణీ చేశారు. 
 పోలీస్‌ బేరెక్స్‌లో ఉన్న 550 మంది హోమ్‌గారు లకు,  ఎం.ఆర్‌  ప్రభుత్వ  ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు, 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు.


*విశాఖపట్నం జిల్లా:*


 జిల్లాలో ఇప్పటివరకు కరోనా   నిర్ధారిత పరీక్షకు పంపిన 887 శాంపిల్స్‌ కు గాను ఈరోజు 80 కేసులు నెగిటివ్‌  వచ్చాయని జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్‌ తెలిపారు. నిన్నటి వరకు 633 నెగిటివ్‌ రాగా ఈరోజుతో ఆ సంఖ్య713 పెరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 20 కేసులలో పాజిటివ్‌ వచ్చిందని, 154 కేసుల రిపోర్ట్‌ రావలసి  ఉందని చెప్పారు. 
 లాక్‌ డౌన్‌ నిబంధనల పేరిట ప్రజలను ఎక్కువ ఇబ్బందులకు గురి చేయవద్దని మరోవైపు జాయింట్‌ కలెక్టరు ఎల్‌.శివశంకర్‌ అధికారులను పోలీసులను ఆదేశించారు. అనవసరంగా రోడ్ల మీదకి వచ్చే వారిపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. బుల్లయ్య కాలేజ్‌ రైతు బజార్‌ ను, అక్కయ్యపాలెం రెడ్‌ జోన్‌ ప్రాంతాన్ని తనిఖీ చేసిన ఆయన, రైతు బజార్‌ ప్రవేశంలో ఏర్పాటుచేసిన స్కానిటైజర్‌ను ప్రారంభించారు. రైతు బజార్లో అమ్మకాలను పరిశీలించారు. కూరగాయలను అధిక ధరలకు అమ్మి నట్లయితే ఫిర్యాదు చేయాలన్నారు. తరువాత అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్‌ లోని మహారాణి పార్లర్, శ్రీనివాస్‌ నగర్‌ ప్రాంతాలను పరిశీలించారు. ఆటోల ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్‌ బజార్‌ లను వినియోగించుకోవాలన్నారు. అవసరం మేరకు సెల్‌ ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ ఇస్తే డోర్‌ డెలివరీ చేయాలన్నారు.


*పశ్చిమ గోదావరి జిల్లా:*


 కారోనా నియంత్రణలో భాగంగా అమలు జరుగుతున్న లాక్‌ డౌన్‌ వల్ల నిరాశ్రయులైన నిరు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు వెల్లడించారు. ఆచంటలోని రామేశ్వరం స్వామి సత్రంలో శనివారం ఆచంట పంచాయతీ పరిధిలో 5 వేల మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలను మంత్రి పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి అందేలా గ్రామ వలంటిర్ల ద్వారా అందజేస్తామని, నిత్యావసర సరుకులు, కాయగూరలు సరఫరా చేసే ఆటోలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించి ఇంటికే పరిమితం కావాలన్నారు. కరోన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. 
 రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కరోన వైరస్‌ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా అరికట్ట వచ్చునన్నారు. లాక్‌ డౌన్‌ వల్ల నిరాశులయిన వారిని ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. మూడవ విడత సర్వే బృందాలు ప్రతి ఇంటిని సర్వే నిర్వహిస్తాయని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సమస్యలు తెలపాలన్నారు. రెడ్‌ జోన్‌ లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదన్నారు. 


*కృష్ణా జిల్లా:*


జిల్లాలో కరోనా పాజిటివ్‌ అనుమానిత 807 శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపగా వాటిలో 35 పాజిటివ్‌గా గుర్తించారు. జిల్లాలో గత 24 గంటలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శాంపిల్స్‌లో 568 నెగటివ్‌ రాగా, ఇంకా 204 ఫలితాలు రావాల్సి ఉంది. 
 జిల్లాలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో 32 క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహిస్తుండగా వాటిలో 431 మందిని ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కార్మికుల కోసం 56 శిబిరాలు ఏర్పాటు చేసి, వాటిలో 4300 మందికి వసతి కల్పిస్తున్నారు. 


*ప్రకాశం జిల్లా:*


జిల్లాలో మార్కాపురం మున్సిపాలిటిని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. శనివారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు అయిన నేపథ్యంలో తీసుకోవలసిన చర్యల పై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్‌  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో  మార్కాపురం మున్సిపాలిటీలో కరోనా  వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు అయిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు సందర్భంగా మార్కాపురం  మున్సిపాలిటీ మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించడము జరిగిందన్నారు. కరోనా వైరస్‌ వ్యాపి చెందుతున్న సందర్భంగా పట్టణంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. 
 మార్కాపురం మున్సిపాలిటీలోకి రాక పోకలు ఒకే మార్గాము ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం పట్టణంలో ని అన్ని రహదారులు మూసి వేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సమాచారం తప్పు కుండా తెలుసుకోని రిజిస్టర్‌ లో నమోదు చేయాలని ఆయన అన్నారు. పట్టణంలో కిరాణా,నిత్యావసర సరుకుల మార్కెట్‌ ల అమ్మాకాల సమయాలను కుదిౌచాలన్నారు.మార్కాపురం మున్సిపాలిటీ ని కంటైన్మెంటు జోన్‌ గా ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వం నియం నిబంధనలు తప్పు కుండా ప్రజలు పాటించాలన్నారు.మార్కాపురం మున్సిపాలిటీ మొత్తం పూర్తి గా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటి లో మొత్త ము సోడియం క్లోరైడ్‌  చల్లిౌచాలన్నారు.మున్సిపాలిటీ లో 3 కిలోమీటర్ల మేర కంటైన్‌ మెంట్‌ లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.మార్కాపురం మున్సిపాలిటీలో డోర్‌ టు డోర్‌ అంటువ్యాధులపై సర్వే చేపట్టాలని కలెక్టర్‌ నిర్దేశించారు. 


*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:*


జిల్లాలో వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ కిట్లు), ఎన్‌–95 మాస్కులు, శానిటేషన్‌ లిక్విడ్, వెంటిలేటర్లకు ఎలాంటి కొరత లేదని.. రీజినల్‌ కోవిడ్‌ సెంటర్‌ జి.జి.హెచ్‌ తో పాటు.. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్‌ –19 బాధితులకు చికిత్స అందించడానికి వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారని కలెక్టర్‌ శ్రీ యం.వి.శేషగిరి బాబు తెలిపారు. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వేగవంతంగా చికిత్స అందిచే ట్రూనాట్‌ మెషిన్స్‌ అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. వీటి ద్వారా ర్యాపిడ్‌ టెస్టులను 50 నిమిషాల్లో చేయవచ్చని, దీని వల్ల కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులను త్వరగా గుర్తించి నివారణ చర్యలను వేగంగా తీసుకోవచ్చన్నారు. జిల్లాలో 718 మంది త్రోట్‌ నుంచి సేకరించిన నమూనాలను స్వాబ్‌ టెస్టుకు పంపించామని 618 ఫలితాలు వచ్చాయని, 100 పరీక్షల ఫలితాలు రావాలన్నారు. 
 హాట్‌ స్పాట్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టి త్రోట్‌ శాంపిల్స్‌ సేకరిస్తున్నామని కలెక్టర్‌ శేషగిరిబాబు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 48 పాజిటివ్‌ కేసులు నమోదు అయినప్పటికీ, వారిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని, మరొకరికి రెండోసారి పరీక్ష చేస్తే, నెగటివ్‌గా వచ్చిందని, దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 46 మాత్రమే అని చెప్పారు. రీజినల్‌ కోవిడ్‌ సెంటర్‌ జి.జి.హెచ్‌ నందు 93 వెంటిలేటర్లు, నారాయణ మెడికల్‌ ఆస్పత్రిలో 17 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు.


*చిత్తూరు జిల్లా:


కరోనా మహమ్మారి నుండి 65 సంవత్సరాలు పైబడిన మన అవ్వ తాత లను, పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా కలదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా శనివారం ఒక ప్రకటనలో కోరారు. 
కరోనా కట్టడికి జిల్లా యం త్రాంగం అన్ని చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా కలదని, ప్రజలందరూ 65 సంవత్సరాలు పైబడిన పెద్ద లు, అవ్వా,తాత లకు మాస్కు లు ఇచ్చి వారు ఇంటి లోనే ఉండే విధంగా, సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. జిల్లాలో మాస్కులు, పిపిఈ కిట్లు అవసరం మేరకు పంపిణీ చేయడమైనదని తెలిపారు.
 పద్మావతి మెడికల్‌ మహిళా వైద్య కళాశాల రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రిగా వైద్య సేవలు అందిస్తుందని, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి గా చిత్తూరు జిల్లా ప్రధా న ఆసుపత్రి కలదని దీనితో పాటు రుయా ను కూడా జిల్లా కోవిడ్‌ ఆసు పత్రి–2 గా ప్రభుత్వం ప్రక టించిందని తెలిపారు. గతం లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్విమ్స్, రుయా ఆసు పత్రు లు రెండూ  కలిసి పని చేయ డం జరి గిందని, ఇందులో ఎటు వంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రుయా జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి 2 గా వైద్య సేవ లు అందించడం జరుగుతుందని కలెక్టర్‌ ఆ ప్రకటనలో వివరించారు.


*అనంతపురం జిల్లా:*


కోవిడ్‌–19 అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల పనితీరు అభినందనీయని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, హౌస్‌ సర్జన్‌ లకు పిపి ఈలు, ఎన్‌95 మాస్కులను జిల్లా కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య సిబ్బందికి, హౌస్‌ సర్జన్‌ లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వారికి అవసరమైన పిపిఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు ఇంకా 5 వేల పిపిఈ కిట్లు, అవసరమైన ఎన్‌95 మాస్కులు తెప్పించి సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా వైరస్‌ నివారణకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ కోరారు. 


*వైయస్సార్‌ కడప జిల్లా:*


 లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో ఉపాధి కోల్పోయిన పేదలందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ బి.అంజాద్‌ బాషా పేర్కొన్నారు. శనివారం ఆయన ఆర్‌కె నగర్‌లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల సమస్యలను దృష్టిలో ఉంచుకొని దాతల సహకారంతో జిల్లాలో 25 వేల మందికి నిత్యవసర సరుకులు ప్రతి డివిజన్లో 500 మందికి చొప్పున  పంపిణీ చేస్తున్నామన్నారు. మరియు ప్రతిరోజూ ఐదువేల మందికి ఉచిత భోజన ప్యాకెట్లు సరఫరా చేస్తున్నామన్నారు. 
 రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రా లు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాయన్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల మన రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించగలిగామన్నారు. 


*కర్నూలు జిల్లా:*


 జిల్లాలో 82  పాజిటివ్‌  కేసులునమోదైన నేపథ్యంలో సంబంధిత  కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో లాక్‌ డౌన్‌ ను తీవ్ర కఠినతరం చేసి ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఆంక్షలు విధించాలని జిల్లా కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మండల ఎంపిడిఓ, తహసీల్దార్, మెడికల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం  కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవలసిన అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌ షెట్టిలతో కలిసి అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన హైరిస్క్‌ ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో లాక్‌ డౌన్‌ ను మరింత తీవ్ర కఠినతరం చేసి 100  శాతం అమలు చేయాలని ఆదేశించారు. 
 కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం ఆయా ప్రాంతాల్లోని పరిధిలో, ఇంటింటికి హైపో క్లోరైడ్‌ సోల్యూషన్‌ తో స్ప్రే చేయించడం, బయోమెడికల్‌ వేస్టేజ్‌ ని ప్రాపర్‌ గా డిస్పోజ్‌ చేయించడం  తదితర పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని వ్యక్తులందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రజల్లో విశేష అవగాహన కల్పించాలన్నారు. కరోనా సంక్రమణ పెద్ద వ్యాధి కాదని కేవలం 14 రోజులు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో హెల్త్‌ సర్వే లైన్‌ మొబైల్‌ బృందాల ద్వారా అందరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వివరించారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image