43,47 డివిజన్ల ప్రజలకు అండగా మహిళా ఐ.టి.ఐ.కళాశాల ప్రిన్సిపాల్

రెడ్ జోన్ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ...
::43,47 డివిజన్ల ప్రజలకు అండగా మహిళా ఐ.టి.ఐ.కళాశాల ప్రిన్సిపాల్
నెల్లూరు, సిటి, ఏప్రిల్, 12 
నెల్లూరు నగరములోని,స్ధానిక రెడ్ జోన్ డివిజన్లుగా నిర్దేశించబడిన 43,47 డివిజన్ నందుగల నిరుపేద ప్రజలకు అంతిమతీర్పు బ్యూరో నయీంఖాన్ కోరిక మేరకు వెంకటేశ్వరపురం ప్రభుత్వ మహిళా ఐ.టి.ఐ.కళాశాల ప్రిన్సిపాల్ రజియా అండగా నిలిచారు.ఆయా ప్రాంతాలలో నివశించే నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి, ప్రిన్సిపాల్ రజియా అందించిన నిత్యావసర సరుకులను నయీంఖాన్, సి.ఐ.టి.యు.నాయకులు ఖాదర్ బాషాతో కలిసి వాటిని అందించారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ వెంకటేశ్వరపురం ప్రభుత్వ ఐ.టి.ఐ.మహిళా కళాశాల ప్రిన్సిపాల్ రజియా నేడు కరోనా లాక్ డౌన్ నేపధ్యములో నిరుపేదలకు సహాయం అందించడం నిజంగా ఆత్మకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.అలాగే ప్రతి నిత్యం ఆమె ఈ రెండు డివిజన్లకు సంబంధించి కూరగాయలు కూడా అందిస్తానని చెప్పడం ఆమె దాతృత్వానికి నిదర్శనం అన్నారు. అంతిమతీర్పు బ్యూరో నయీంఖాన్ మాట్లాడుతూ కరోనా నేపధ్యములో అధికారులు సేవా కార్యక్రమాలను ఒక్కచోట చేయవద్దని సూచించారని, అలాంటి ఆదేశాల్ మేరకు, వెంకటేశ్వరపురం ప్రభుత్వ మహిళా ఐ.టి.ఐ.కళాశాల ప్రిన్సిపాల్ రజియా సహాయ సహకారాలతో ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో అలాంటి వారికి ఇళ్ళకు వెళ్లి నేడు బియ్యం అందించామని, అలాగే కూరగాయలు కూడా సోమవారం నుంచి అందిస్తామని అన్నారు.