ముఖ్యమంత్రి కి చంద్రబాబు నాయుడు లేఖ

09.04.2020
గౌ. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.
విషయం: విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యత గుర్తించడం-అదేతరహాలో అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా పునరుద్దరణ-ఆర్టీజీ బలోపేతం-రైతులకు మద్దతుధర చెల్లించి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల కొనుగోళ్లు-ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ 5వేల ఆర్ధిక సాయం గురించి: 
                                       ......
1)విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యత గుర్తించడం ముదావహం: 
దేశంలోనే తొలి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్ గా విశాఖపట్నంలో నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం ముదావహం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, ముందుచూపు ఆలోచనలే ప్రస్తుత మెడ్ టెక్ జోన్ పనితీరుకు నిదర్శనాలు. ప్రస్తుత సంక్షోభంలో 55నిముషాల్లోనే కరోనా నిర్ధారణ చేసేలా టెస్టింగ్ కిట్ల తయారీకి విశాఖ మెడ్ టెక్ జోన్ వేదిక కావడం శుభపరిణామం. రోజుకు 2వేల కిట్ల తయారీ సామర్ధ్యం ఈ నెలాఖరుకు 25వేల కిట్ల తయారీకి, మే నెలాఖరుకు ఏడున్నర లక్షల కిట్ల తయారీకి చేరుకోవడం ప్రస్తుత కరోనా కారుచీకట్లో నిజంగా కాంతిరేఖలే. 3వేలకు పైగా వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పిపిఈ) మన మెడ్ టెక్ జోన్ లో యుద్దప్రాతిపదికన తయారీ చేయడం ముదావహం.  
ఈ 10నెలలు దానిని నిర్లక్ష్యం చేయకుండా, మరింత అభివృద్ది చేసినట్లయితే ప్రస్తుత కరోనా సంక్షోభంలో దేశానికే మరింత మెరుగైన సేవలు అందించే స్థాయిలో ఉండేది. మరిన్ని కంపెనీలు మెడ్ టెక్ జోన్ కు రావడమే కాకుండా, దేశానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులోకి వచ్చేది.
   గత ప్రభుత్వంపై అక్కసుతో, పదేపదే అవాస్తవ ఆరోపణలతో, ఎంక్వైరీల పేరుతో తొలి ఏడాది విలువైన కాలాన్ని వృధా చేశారు. మయసభగా మెడ్ టెక్ జోన్ ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు దేశానికే గర్వకారణంగా చెప్పడం ఆనంద దాయకం. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఏడాది ఆలస్యంగా అయినా మెడ్ టెక్ జోన్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం సంతోషకరం. 
2) మెడ్ టెక్ జోన్ తరహాలోనే ఈ వ్యవస్థలను(అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా, ఆర్టీజిఎస్)కూడా పునరుద్దరించాలని, బలోపేతం చేయాలని విజ్ఞప్తి: 
ఎ) అన్నా కేంటిన్ల పునరుద్దరణతో పేదలకెంతో మేలు: 
 అన్నా కేంటిన్లను కూడా పునరుద్దరించే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదల ఆకలిదీర్చే అన్నా కేంటిన్లను రాజకీయ కక్షతో మూసివేయడం తగనిపని. అన్నా కేంటిన్లే గనక ఉండి ఉన్నట్లయితే ఇప్పుడీ కరోనా సంక్షోభంలో పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేవనేది ప్రజల్లో నెలకొన్న విస్తృతాభిప్రాయం. కేరళలో పీపుల్ కేంటిన్లు, కర్ణాటకలో ఇందిరా కేంటిన్లు, హైదరాబాద్ లో అన్నపూర్ణ కేంటిన్ల విజయగాథల స్పూర్తితో అయినా మన రాష్ట్రంలో అన్నా కేంటిన్లను తక్షణమే పునరుద్దరించాలని కోరుతున్నాం. 
బి)‘‘బీమా పథకం’’ ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు ఆదరవు అయ్యేది: 
కరోనా మహమ్మారి బారిన పడి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అనారోగ్యంతో అల్లాడుతున్నారు, వేలాది ప్రజలు బలి అయ్యారు. అనేక కుటుంబాలు అనాధలుగా మారాయి. మనదేశంలో, రాష్ట్రంలోనూ కరోనా విధ్వంసం విస్తృతరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో ‘‘బీమా పథకం’’ రద్దు చేయకుండా కొనసాగించివుంటే, ఆయా కుటుంబాలకు ఎంతగానో అక్కరకు వచ్చేది. 
ప్రత్యామ్నాయంగా కొత్తపథకం తేకుండానే రాష్ట్రంలో ‘‘చంద్రన్న బీమా’’ పథకాన్ని అర్ధంతరంగా రద్దు చేయడం అనాలోచిత చర్య. ఇప్పుడదే పథకం ఉండివుంటే, కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు, భవిష్యత్ పై ఎంతో భరోసాగా ఉండేది. కాబట్టి తక్షణమే ‘‘బీమా పథకాన్ని’’ పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాము. 
సి)ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ‘‘ఆర్టీజి’’ ఎంతో ఉపయోగకరం:  
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గాడితప్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి)కి నూతన జవసత్వాలు కల్పించి మళ్లీ సమర్ధంగా నిర్వహించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఆర్టీజి వల్ల గత ప్రభుత్వంలో ఎన్నో సత్ఫలితాలు సాధించాం. 
తిత్లి తుపాన్ విపత్తులో, ఇతర సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరవేసేందుకు, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సకాలంలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్టీజి ఎంతగానో దోహదపడింది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో కూడా ఆర్టీజిని మరింత సమర్ధంగా వినియోగించుకుని వుంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం ఉండేది కాదు. 
కాబట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) వ్యవస్థను వెంటనే పునరుద్దరించాలి, మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నాం. 
3)మద్దతు ధర చెల్లించి పంట ఉత్పత్తులన్నీ కొని రైతులను ఆదుకోవాలి:కరోనా లాక్ డౌన్ కారణంగా కూలీలు దొరకక, లారీలు లేక, రవాణా స్థంభించి కనీస మద్దతుధర లభించక రాష్ట్రంలో ధాన్యం రైతులు, పత్తి, మిర్చి, హార్టీకల్చర్, ఆక్వా రైతాంగం, ఫౌల్ట్రీ, సెరికల్చర్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆయా రంగాల రైతులను ఆదుకోవాలి. 
4) ప్రతి పేద కుటుంబానికి రూ 5వేల ఆర్ధిక సాయం అందించాలి: 
లాక్ డౌన్ తో పనులు కోల్పోయి జీవనం దుర్భరంగా మారిన రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, ఇతర చేతివృత్తులవారు, ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి తక్షణమే, కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలి.  
5) వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం, విధ్వంసం సులభం: 
వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం, వాటి విధ్వంసం చాలా సులభం. వ్యక్తి చేయలేని పనిని ఒక వ్యవస్థ ద్వారా చేయవచ్చు. మరింత మెరుగ్గా, సమర్ధంగా ప్రజలకు సేవలు అందించవచ్చు. 
దప్పిక అయినప్పుడే బావిని తవ్వాలనే ధోరణి విజ్ఞత కాదు. నిర్మాణం చేసేవాళ్లనే ప్రజలు పదికాలాలు గుర్తుంచుకుంటారు. విధ్వంసం చేసేవాళ్లు చరిత్రగతిలో తెరమరుగు అవుతారు. 
వీటన్నింటిని గుర్తుంచుకుని ఇకనైనా రాష్ట్రంలో విధ్వంసాలకు స్వస్తి చెప్పి వ్యవస్థల నిర్మాణంపై, వాటి బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము. నిర్మాణ దృక్ఫథంతో, భవిష్యత్ తరాలకు సరైన దిశా నిర్దేశం చేయడమే పాలనాధర్మంగా తెలియజేస్తున్నాను. 
నారా చంద్రబాబు నాయుడు
(తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత)


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image