జర్నలిస్ట్ లకు మంత్రి కన్న బాబు నిత్యావసర సరుకుల పంపిణీ

జర్నలిస్ట్ లకు మంత్రి కన్న బాబు నిత్యావసర సరుకుల పంపిణీ
 కాకినాడ :     ప్రస్తుత విపత్కర  పరిస్థితుల్లో నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. ప్రాణాలకు తెగించి lock down సమయంలో మీడియా చేస్తున్న కృషిని కన్నబాబు అభినందించారు. తాను ఒక జర్నలిస్ట్ గా పాత్రికేయుల కష్టనష్టాలు తనకు తెలుసునని అందుకే తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చానని కన్నబాబు తెలిపారు. తండ్రి కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా 10 లక్షల విలువైన సామగ్రి ని  సుమారు 400మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, కాయగూరలు, పండ్లను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు జర్నలిస్టులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశానని
ఆయన తెలియజేశారు. ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించిన మంత్రి కన్నబాబు కు పాత్రికేయులు అందరూ ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ నగర. కాకినాడ రూరల్, కరప మండలం చెందిన పాత్రికేయులు అంతా హాజరై మంత్రి కన్నబాబు అందజేసిన సహాయాన్ని ఆనందంతో స్వీకరించారు. ఈ కష్ట సమయంలో  తమను ఆదుకున్న కన్నబాబు కు తమ కుటుంబం అంతా రుణపడి ఉంటామని జర్నలిస్టులు తెలియజేశారు.