ఏపీ సీఎం సహాయ నిధికి. డా.రెడ్డీస్ ల్యాబ్స్ రూ. 5 కోట్ల విరాళం

అమరావతి


ఏపీ సీఎం సహాయ నిధికి. డా.రెడ్డీస్ ల్యాబ్స్ రూ. 5 కోట్ల విరాళం


రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి డా.రెడ్డీస్ ల్యాబ్స్ రూ. 5 కోట్ల రూపాయల సహాయాన్ని అందించింది. ఈమేరకు డా.రెడ్డీస్ ల్యాబ్స్ కు చెందిన డా.వి.నారాయణ రెడ్డి విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి సియం సహాయ నిధికి రూ. 5 కోట్ల రూపాయల చెక్కు ను అందించారు. ఈసందర్భంగా సిఎస్ నీలం సాహ్ని డా.రెడ్డీస్ ల్యాబ్ అందించిన సహాయం పట్ల వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.