550 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, మామిడికాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

        ఉయ్యురు, ఏప్రిల్, 19 (అంతిమ తీర్పు) :    కరోనా వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇలాంటి సమయంలోనే అండగా ఉందాం. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


     శనివారం   ఉయ్యురు నగర పంచాయతి 20 వార్డు లో  తెలుగుదేశం పార్టీ నాయకులు పాండ్రాజు చిరంజీవి ఆధ్వర్యంలో సుధారాణి పర్యవేక్షణలో 550 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, మామిడికాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్


ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని మనమందరం లాక్ డౌన్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని అలాగే జీవన ఉపాధి లేక ఇల్లు గడవని పేదకుటుంబాలకు ఇలాంటి కష్ట సమయంలోనే మనం కలిసి కట్టుగా ఆదుకోవాలని దానిలో భాగంగానే ఈ రోజు 20 వార్డులో  చిరంజీవి ప్రతి ఇంటికి కూరగాయలు, మామిడికాయలు పంచడం అభినందనీయం అని రాజేంద్ర ప్రసాద్  అన్నారు. 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, కూనపరెడ్డి వాసు, తోట శ్రీను,lp రఫీ, నడిమింటి పైడయ్య, బూరెల నరేష్, గోరెంట్ల నరేంద్ర, పెన్నేరు సాంబయ్య మరియు చిరంజీవి ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.