రుయా ఆరోగ్య శ్రీ అత్యవసర సేవల పేషేంట్ల కు నెట్ వర్క్ ఆసుపత్రులు సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్

 


రుయా ఆరోగ్య శ్రీ అత్యవసర సేవల పేషేంట్ల కు నెట్ వర్క్ ఆసుపత్రులు సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్



తిరుపతి, ఏప్రిల్ 27: ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా ఆసుపత్రి కోవిడ్ – 19 సేవలకు ఉపయోగించాల్సి ఉన్నందున రుయాకు వచ్చే రోగుల అత్యవసర, చికిత్సలను తిరుపతిలోని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను ఈ నెల 28 నుండి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా సూచించారు. సోమవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ వారి కార్యాలయం లో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రభుత్వ వైద్య అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. 
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు కనీసం 3 వేల బెడ్లు కోవిడ్ పాజిటివ్ సేవలకు ముందస్తు రిజర్వ్ గా  అవసరం ఉన్న నేపథ్యంలో రుయా ఆసుపత్రిని పూర్తిగా జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మార్చనున్నామని తెలిపారు. రుయాలో అత్యవసర సేవల కోసం వస్తున్న రోగులను అక్కడే పరిశీలించి కోవిడ్ టెస్ట్ చేసి వైద్య చికిత్సల కోసం ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు పంపనున్నామని తెలిపారు. తిరుపతిలో ఉన్న 15 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఏ రోజు ఏ ఆసుపత్రికి పంపాలనే రోస్టర్ ప్రైవేట్ ఆసుపత్రులు చర్చించి రుయా సూపరింటెండెంట్ కు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒక వేల పాజిటివ్ నమోదు అయిన వ్యక్తికి రుయాలోనే చికిత్స అందించనున్నామని తెలిపారు. లాక్ డౌన్ తరువాత కూడా కనీసం 6 నెలలు కాలం రుయా నుండి  పంపిన రోగులకు చికిత్సలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. రోస్టర్ మేరకు నిర్ధారించిన చికిత్సలు అవసరమైన కేసులను ట్రూ నాట్ లో నిర్ధారించిన వెంటనే ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు వారి అంబ్యులెన్స్ లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ లాబ్ లలో కోవిడ్ టెస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అందుకే రుయాలో నిర్ధారించి పంపడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కోవిడ్ కోసం పాత మెటర్నేటీ, ఇ ఎస్ ఐ, రుయా ఆఆసుపత్రులను రిజర్వు చేసి ఉంచామని తెలిపారు.


అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాకు వివరిస్తూ కోవిడ్ టెస్టులను జిల్లా లో తిరుపతి రుయా, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, వెటర్నరీ ఆసుపత్రులలో 17 ట్రూ నాట్ మెషిన్ల ద్వారా చేస్తున్నామని, స్విమ్స్ ఐ సి ఎం ఆర్ మెషిన్ కు ట్రూ నాట్ లో నిర్ధారణ అయిన పాజిటివ్ ను మరోసారి టెస్టింగ్ చేసి ఐసోలేషన్ కు తరలిస్తామని తెలిపారు.ఇప్పటి వరకు 11 వేళా సాంపిల్స్ టెస్ట్ చేసాము,  నిన్నటికి  242 శ్యాంపిల్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గతంలో జిల్లాలో స్విమ్స్ లో ఒక్క మిషన్ తో 100 చేయగలిగే వాళ్లం, ఇప్పుడు 4 ఉన్నాయి, మూడు షిఫ్ట్ లలో పనిచేసున్నారు, రెండు రోజుల్లో మరో 5 ట్రూ నాట్ మెషిన్లు జిల్లాకు రానున్నాయని తెలిపారు. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసులు జిల్లాలో రాలేదని, తగ్గుముఖం అని కూడా ఊహించలేమని తెలిపారు. గతం లో శ్యాంపిల్స్ కు ఆలస్యం 5 జిల్లాల టెస్టులు జరిగేవని, ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా నిర్దేశించారని, రిజల్ట్ ఇబ్బంది లేదని, ఆలస్యం కాదని వివరించారు.


శ్రీకాళహస్తి కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ , అసిస్టెంట్ కలెక్టర్ పృద్వి తేజ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి కి సంబందించి సర్వే మేరకు కేసులు  నమోదు కావడంతో రాపిడ్ టెస్ట్ ల  ద్వారా 920 మందికి సాంపిల్స్ టెస్ట్ చేశామని ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదని తెలిపారు. గత 4 రోజులుగా రాండంగా, అనుమానం ఉన్న వారిని ప్రతి రోజు మరో 70 వరకు సాంపిల్స్ సేకరణ చేస్తున్నామని, ప్రజలు చిన్న పాటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని కోరారు.  వార్డులలో వాలింటర్లు, ఆశా కార్యకర్తలు, ఎ. ఎన్. ఎం.లు అందుబాటులో వున్నారని, 20 మందికి పైగా  జూనియర్ డాక్టర్లు సేవలందిస్తున్నారని తెలిపారు. 


ఈసమావేశం లో అసిస్టెంట్ కలెక్టర్ పృద్వి తేజ్,  జె సి 2 చంద్రమౌళి, ఆర్డిఓ కనక నరసారెడ్డి, డి ఎం హెచ్ ఓ పెంచలయ్య, ఆరోగ్య శ్రీ కో – ఆర్డినేటర్ బాల ఆంజనేయులు,  రుయా సూపరింటెండెంట్ భారతి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, పి. డి. డ్వామా చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల  డాక్టర్ లు రష్ సుబ్రమణ్యం, ఐఎం ఏ శ్రీ హరి రావు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల డాక్టర్ లు హాజరయ్యారు.