మేము సైతం మీతో ఉన్నాం ;జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

విజయవాడ,ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు):
                మేము సైతం మీతో ఉన్నాం
మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులకు 53వ డివిజన్లో ఉన్న స్థానిక మున్సిపల్ డివిజన్ ఆఫీస్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మరియు 53 డివిజన్ బిజెపి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో 55 మంది పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి, నిత్యావసర సరుకులు కిట్ అందించడం జరిగింది.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ప్రజా ఆరోగ్యం పట్ల వీరు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత ఎంత కొనియాడిన తక్కువ అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం  కరోనా విపత్కర సమయంలో వీరు చేస్తున్న సేవలను గుర్తించి జీతంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు 25% బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాల్లో 10 నుంచి 15 శాతం తగ్గించి ఇవ్వడం సమంజసం కాదని వారికి కూడా పూర్తి జీతంతో పాటు బోనస్ కూడా అందించాలని మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్  మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి ఈ సేవలు కు ఉడతాభక్తిగా శాలువాతో సత్కరించి కొన్ని నిత్యావసర సరుకుల అందజేస్తున్నామని సమాజం మొత్తం వీరు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సేవలను గుర్తించి బోనస్ ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నూనె. సోమశేఖర్, సాసుపిల్లి.నాని, బాలాజీ, రాజేష్ వ్యాస్ పాల్గొన్నారు.