08–04–2020
అమరావతి
*కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష*
*అధికారుల ప్రతిపాదనలపై చర్చ*
*గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం, ఇదిచేస్తాం అని గాలిమాటలు వద్దన్న సీఎం*
*నూతన ఇండస్ట్రియల్ పాలసీలో వాస్తవిక దృక్పథం ఉండాలన్న సీఎం*
*పరిశ్రమలకు పెండింగులో ఉన్న ఇన్సెంటివ్‌ల చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి*
*దశలవారీగా చెల్లించడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం*
*పారిశ్రామిక కాలుష్యాన్ని పూర్తిగా నివారించడానికి దృష్టిపెట్టాలని ఆదేశం*
*ప్రభుత్వమే వ్యర్థాల సేకరణ, నిర్వహణ చేపడుతుందన్న సీఎం*
*ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందించాలని నిర్ణయం
పరిశ్రమలపై కోవిడ్ ప్రభావంపైనా చర్చ*
అమరావతి:
– కొత్త పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్ష
– పరిశ్రమలశాఖ మంత్రి గౌతంరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌భార్గవసహా ఉన్నతాధికారులు హాజరు.
– కొత్త పారిశ్రామిక విధానం ప్రతిపాదనలపై చర్చ
– గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం, ఇదిచేస్తాం అని మాటలు చెప్పి చివరకు ఏదీ చేయని పరిస్థితి ఉండకూడదన్న సీఎం
– గడచిన ఐదేళ్లుగా సుమారు 4800 కోట్లు పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇంటెన్సివ్‌లు పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి
– ఇవి చెల్లించకుండా.. అది చేస్తాం, ఇది చేస్తాం.. అనిమాటలు చెప్పడంవల్ల ప్రయోజనం ఉండదన్న ముఖ్యమంత్రి
– ఎవ్వరినీ మోసం చేసే రీతిలో, హామీ ఇచ్చి చివరకు ఏదీ ఇవ్వకూడని రీతిలో ఈపాలసీ ఉండకూడదన్న ముఖ్యమంత్రి.
– మనం చెప్పే మాటలపై పరిశ్రమలు పెట్టేవారికి విశ్వాసం ఉండాలన్న సీఎం
– ఇంటెన్సివ్‌ల రూపంలో ఉన్న బకాయిలను దశల వారీగా చెల్లించడానికి ప్రరయత్నాలు మొదలుపెట్టాలన్న సీఎం.
– పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కేటగిరీ పరిశ్రమల వారీగా ఈ ఇంటెన్సివ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాలన్న సీఎం
– పరిశ్రమలకు భూమి, నీరు, కరెంటు ఇద్దామని, వీటి విషయంలో నాణ్యమైన సేవలు అందిద్దామన్న సీఎం.
– భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల వారీగా ఆధారపడ్డ ఉద్యోగులు ఎంతమంది అన్నదానిపై వివరాలు తయారుచేయాలని సీఎం ఆదేశం
– పెద్ద సంఖ్యలో ఉపాధినిస్తున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటునందించేదిశగా అడుగులు ముందుకువేయాలన్న సీఎం
– ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంపై కోవిడ్–19 ప్రభావంపై సమావేశంలో చర్చ
– ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలపైనా సమావేశంలో చర్చ.
– మారుతున్న పరిణామాలు, వివిధ దేశాల ఆలోచనల్లో మార్పులు కారణంగా రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్దికి తోడ్పడే వివిధ కేటగిరీల పరిశ్రమలపైనా కసరత్తు చేయాలన్న సీఎం
– రాష్ట్రంలోని పరిశ్రమలపైనా కరోనా వైరస్ ప్రభావంపై సమావేశంలో చర్చ.
– కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభావాన్ని అంచనావేస్తోందని, తుదిగా ఒక విధానం వెలువడే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.
– దీనిపై కూడా దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.
కాలుష్య నివారణకు పెద్దపీట:
– రాష్ట్రంలో కాలుష్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలని స్పష్టంచేసిన సీఎం
– ప్రతి పరిశ్రమ నుంచి కూడా వచ్చే పొల్యూషన్‌ను జీరో స్థాయికి చేర్చాలన్న ముఖ్యమంత్రి
–పరిశ్రమలనుంచి వ్యర్థాలను సేకరించి కాలుష్యం లేకుండా చేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తోందన్న సీఎం
– సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా ఆ కాలుష్య నివారణా విధానం ఉండాలన్న సీఎం
– పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన నీటినే వినియోగించేలా ఇదివరకే ఆలోచనలు చేసినందున, దీనిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.