వలస కూలీలు హోం క్వారంటైన్ పాటించండి

వలస కూలీలు హోం క్వారంటైన్ పాటించండి
మంత్రాలయం,ఏప్రిల్, 30 (అంతిమ తీర్పు):-
గుంటూరు, చీరాల, సత్తైనపల్లి తదితర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వలస కూలీలు తప్పకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించాలని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి కోరారు. గురువారం ఉదయం మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోణ గ్రామ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఇతర ప్రాంతాల నుంచి 10 బస్సులో వచ్చిన దాదాపు 300 మంది వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి వలస కూలీలకు టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులు , పారిశుధ్య కార్మికుల పని తీరు చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి కరోనా వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాంపురం, కాచాపురం, రచ్చమర్రి, ఆకుల బిచ్చాల, గుండ్రేవుల తదితర గ్రామాలకు చెందిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో సోంత గ్రామాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాధ, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, వైద్యాధికారి సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.