*30–04–2020*
*అమరావతి*
*మత్స్యకారులకి మహర్ధశ
*రాష్ట్రవ్యాప్తంగా 8 ఫిషింగ్ హార్బర్లు, 1చోట ఫిష్ ల్యాండ్ నిర్మాణం*
*అమరావతి:*
*మత్స్యకారులకి మహర్ధశ*
*9 చోట్ల చేపలవేటకు చక్కటి మౌలిక సదుపాయాలు*
*రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మించనున్న ప్రభుత్వం*
*దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం*
*రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
క్యాంపు కార్యాలయలంలో సమీక్షించిన ముఖ్యమంత్రి,
మంత్రి మోపిదేవి సహా ఇతర అధికారులు హాజరు
శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నంలో 1, తూ.గో.లో 1, ప.గో.లో 1, కృష్ణాజిల్లాలో 1, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరులో 1 చొప్పున నిర్మాణం
శ్రీకాకుళం జిల్లాలో బడగట్లపాలెం– మేజర్ ఫిషింగ్ హార్బర్,
శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో– ఫిష్ ల్యాండ్ నిర్మాణం.
విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్ ఫిషింగ్ హార్బర్,
తూ.గో.జిల్లా ఉప్పాడలో – మేజర్ ఫిషింగ్ హార్బర్
ప.గో.జిల్లా నర్సాపురంలో – మేజర్ ఫిషింగ్ హార్బర్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో – మేజర్ ఫిషింగ్ హార్బర్,
గుంటూరుజిల్లా నిజాంపట్నంలో– మేజర్ ఫిషింగ్ హార్బర్,
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో– మేజర్ షిఫింగ్ హార్బర్
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో– మేజర్ ఫిషింగ్ హార్బర్‌లను నిర్మించనున్న ప్రభుత్వం.
రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోకూడదు: సీఎం
రెండున్నర మూడు సంవత్సరాల వ్యవధిలో వీటిని పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారు: మంత్రి మోపిదేవి వెంకట రమణ
గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు: మోపిదేవి వెంకటరమణ
ఇప్పుడు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ కట్టబోతున్నాం: మంత్రి మోపిదేవి వెంకటరమణ
ముఖ్యమంత్రిగా మీరు కల్పిస్తున్న అవకాశాలు మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులను తీసుకు వస్తాయి:
చేపలవేట పెరగడమే కాదు, వారికి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడుతుంది:
ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న కార్యక్రమాలను మత్స్య కారులు ఎవ్వరూ మరిచిపోలేరు : మంత్రి
మోపిదేవి వెంకటరమణ
సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.