బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు

🌷అంబెడ్కర్ జయంతి శుభాకాంక్షలు🌷
 ✊️డా: భీమ్ రావ్ రాంజీ అంబెడ్కర్✊️ 

బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు 
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ జీవనం:
తల్లిదండ్రులు:-
తల్లీ భీమాభాయ్ సక్పాల్ 
తండ్రి రాంజీ మాళోజి సక్పాల్ (బ్రిటిష్ ఆర్మీ సుభేధారి )
👉గ్రామం:అంబవాడ గ్రామం 
జిల్లా: రత్నగిరి, మహారాష్ట్ర. 
జననం:14-ఏప్రిల్ -1891
👉వివాహం: 
రమాబాయి అంబెడ్కర్ 1906 లో వివాహం జరిగింది. (1935 లో రక్త హీనతతో రమాబాయి చనిపోయారు)
సవిత అంబెడ్కర్:(శారద కబీర్)
1948-ఏప్రిల్ -15 న వివాహం చేసుకున్నారు. 
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ మరణం:
రాజకీయ పరిస్థితులపై తన అనుచరులు అనుకున్న వారి వ్యవహారి సైలి వలన, తీవ్ర వత్తిడి వలన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు. 
👉బాబా సాహెబ్ తొమ్మిది భాషల్లో పూర్తి ప్రావీణ్యం కలిగి ఉన్నారు 
మరాఠి, హిందీ, ఇంగ్లీష్, గుజరాతి, పాళీ సంస్కృతం, జర్మన్, పార్శి, ఫ్రెంచ్.. 
👉అంబెడ్కర్ ఒక విశ్వ మానవుడు 
👉ఆయన చదువు నాడు దేశ చరిత్రలో ఒక సంచలనం 
👉ఆయన పడ్డ అవమానాలు అనిర్వచనీయం 
👉ఆయన జ్ఞానం అసమాన్యం 
👉ఆయన ముందు చూపు,ఆలోచన జాతికి మేలుకొలుపు. 
👉అంతటి గొప్పవ్యక్తికి మన దేశ సమాజంలో ప్రతీ మూల మూలల నుండి విచక్షణను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.. !!
ధైర్యంగా ఎదుర్కొని చివరకు జాతికి తన జీవితం ఒక ఉదాహరణగా చాటి చెప్పిన మహనీయుడు.
✍️B.R.AMBEDKAR గారి గురించి క్లుప్తంగా:
అంబెడ్కర్ గారి అసలు పేరు నిజానికి అంబవాడేకర్ గా రికార్డ్స్ లో ఉండేది.. !!
ఆయన "మహర్"  అనే తక్కువ (దళితులలో)పుట్టారు.. !!
కానీ ఆయన గురువు మహాదేవ్ అంబెడ్కర్ (బ్రాహ్మణుడు)అంబెడ్కర్ గారికి చదువు పై ఉన్న ఆసక్తిని గమనించి, అంబెడ్కర్ గారు గొప్పవారు అవుతారు అని ముందే గమనించి, ఆయన ఎదుగుదలకి తప్పకుండా కులం అడ్డు వస్తుందని ఆలోచించి పాఠశాల రికార్డులో "అంబేవాడేకర్" నుండి 
గురువుగారు (బ్రాహ్మణ ) ఇంటిపేరు ఐన "అంబెడ్కర్"ని ఆయనకు పెట్టారు 
ఇది ఆయన పేరు వెనుక ఉన్నా అసలు చరిత్ర.. !
👉నాకు ఆయన గురించి ఎప్పటికీ అర్ధం కాని విషయం ఒకటుంది ఆయన్ని తన దేశం ఇంతగా అసహ్యించుకున్నా, ద్వేషించినా ఆయన ఎప్పుడూ తన దేశ ప్రజల మీద అసహ్యం,  కోపం,  పగ పెంచుకోలేదు.. !!
ఎందుకో మరి 
వేరే వాళ్ళు ఐతే దేశం వదిలి తప్పకుండా వెళ్ళిపోయేవారేమో. 
✍️Dr.B.R అంబేద్కర్ గారి చదువులు📖📖
👉 మెట్రికులేషన్ -1908 
👉 B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
👉M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
👉Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
👉D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
 M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
👉Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
👉 Political Economics - Germany. 
👉LLD - (Honoris) Columbia University, New York, For his achievements. 
✍️ఆయన జీవితం లో ఎదుర్కొన్న అంటరానితనానికి ఉదాహరణలు 
👉చిన్నతనంలో school లో తన తోటి విద్యార్థులు ఆయన అంటరానివాడు అని క్లాస్ నుండి గెంటేఇస్తే కిటికీలో నుంచి చూసి చదువుకున్న మేధావి.. !!
👉అదేంటో ఆయన పోరాడింది బీదలకోసం, బడుగు బలహీన వర్గాల కోసం.. అంటే SC, ST, BC, ల కోసం 
అలా అని ఆయన అగ్రవర్ణాల మీద ఇసుమంత ద్వేషం కూడా పెంచుకోలేదు. వారు కూడా బాగుండాలని కోరుకున్నారు. 
👉కరెక్ట్ గా చెప్పాలంటే జాతి మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకున్నారు..!!
కానీ చాలా విచిత్రం ఆయన కేవలం దళితుల ఆస్తిగా  వారికి మాత్రమే ఆశాకిరణంగా మారిపోయి ఆయన్ని కొందరు బాదించారు అది చాలా బాధాకరం.
👉ఆయన అందరి ఆస్తి 
ఇంకా చెప్పాలంటే ఆయన జాతి ఆస్తి.. !!
అంబెడ్కర్ ఈ భారత జాతి ముద్దుబిడ్డ..!!
ఈ దేశ ప్రజలందరికి అంబెడ్కర్ ఆలోచనతో నడిచే ప్రతీ భారతీయ పౌరునికి అంబెడ్కర్ పై హక్కుంది.. !!
అంబెడ్కర్ గారు ఒక్క దళితుల కోసమే పోరాడలేదు.
✍️ఆయన సాధించిన విజయాలలో కొన్ని :
👉పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కు కల్పించిన మహిళా పక్షపాతి. 
👉కార్మికులకు, ఉద్యోగులకు 8 గంటల పని హక్కు కల్పించిన కార్మిక పక్షపాతి. 
👉భారతీయులందరికి 18 సంవత్సరాల వయస్సుకే ఓటు హక్కును కల్పించారు 
👉బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 5 సంవత్సరాలనుండి 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఉచిత విద్యా హక్కు కల్పించిన చిన్నారుల ఆనిముత్యం. 
👉బానిస బ్రతుకులు బ్రతుకుతున్న అంటరానివాళ్ళ విముక్తి కోసం SC, ST, BC లకు రిజర్వేషన్స్ కల్పించిన ఆరాద్యుడు అంబెడ్కర్..
👉దేశంలో రిజర్వు బ్యాంకు ద్వారా ప్రతీ ఒక్క భారతీయుడికి ఆర్థిక హక్కులతో పాటు ఇంకా ఎన్నో హక్కులను ప్రసాదించిన మహనీయుడు అంబెడ్కర్.. 
👉అన్నిటికంటే గొప్ప సంగతి దేశం గర్వపడే విషయం అంబెడ్కర్ భారతీయులందరికీ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహాజ్ఞాని.. 
✍️అంబెడ్కర్ అనే వ్యక్తి:
👉ఒక గొప్ప కాన్స్టిట్యూషనలిస్ట్ 
👉ఒక విప్లవకారుడు 
👉ఒక గొప్ప పార్లమెంటేరియన్ 
👉ఒక గొప్ప ఎకనామిస్ట్ 
👉ఒక గొప్ప సామాజిక వేత్త 
👉ఒక గొప్ప రాజకీయ వేత్త 
👉ఒక గొప్ప ఇండియన్ జ్యూరిస్ట్ 
👉ఒక గొప్ప బౌద్ధ కార్యకర్త
👉ఒక గొప్ప ఫిలాసఫర్ 
👉ఒక గొప్ప ఆలోచనకర్త 
👉 ఒక గొప్ప ఆంథ్రోపోలోజిస్ట్ 
👉ఒక గొప్ప చరిత్ర కారుడు 
👉ఒక గొప్ప ప్రసంగీకుడు 
👉ఒక గొప్ప సాంఘీక సంస్కర్త 
✍️ఆయన ద్వారా జరిగిన కొన్ని మేలులు:
👉మహిళా కార్మికులకు సంక్షేమనిధి 
👉ESI
👉ప్రావిడెంట్ ఫండ్ చట్టం 
👉మహిళా శిశు కార్మికుల రక్షణ చట్టం 
👉మహిళలు కార్మిక బిల్లు 
👉ప్రసూతి ప్రయోజనం 
👉విడాకులు చట్టం 
👉ఆస్తి హక్కు 
👉కార్మికులకు సెలవు ప్రయోజనాలు 
👉revision of scale of pay for employees.. 
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో 
కానీ.. !
ఇంత గొప్ప మేధావిని కేవలం తక్కువ కులం అనే కారణంతో తిరస్కరించబడ్డారు.. !!
ఈ మేధావిని ప్రపంచం మొత్తం గుర్తించింది... ఒక్క మనదేశ మెజారిటీ ప్రజలు తప్ప.. !!
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ:
నా జీవితాన్ని, నా కుటుంబాన్ని త్యాగం చేసిన ఫలితంగా మీకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు, ఎన్నో హక్కులు, ఎన్నో చట్టాలు అందించాను. 
మన సమాజంలో కొంతపురోగతి కనిపిస్తుంది. 
విద్యా వంతులైన కొందరు ఉన్నత స్థాయికి చేరారు. 
చదువు పూర్తి ఐనాకా వారు సమాజానికి సేవ చేస్తారని ఆశించాను. కానీ వారు నన్ను మోసగించారు. విద్యాబ్యాసంతో చిన్న, పెద్ద గుమస్తాల గుంపులు బయలుదేరి, తమ పొట్టల్ని నింపుకోవడం మాత్రమే కన్పిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు తమ జీవితంలో 20% తమ జాతి కోసం ఉద్యమ విరాళంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సమాజం పురోగమిస్తుంది, లేకపోతే ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. 
చదువుకున్న వారిపై గ్రామాలలో ఉన్నవారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.విద్యావంతుడైన సామాజిక కార్యకర్త లభించడం వారికి ఒక వరం లాంటిది అని ఆయన ఎంతో మనోవ్యధతో అన్నారు.
1956 లో అంబెడ్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నాటికంటే ఈ రోజు ఉద్యోగులు సంఖ్య ఎన్నో రెట్లు అధికమైంది. కానీ వారిలో తమ జాతి కోసం ఆలోచిస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. 
ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా, సామాజిక వర్గంలోనైనా చదువుకున్న మధ్యతరగతి వర్గం మౌనంగా ఉండే సమాజానికి దేశానికి భవిత ఉండదు. ముఖ్యంగా దళితుల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. 
ఈ కులాల ప్రజలకు భూమి లేదు, వ్యాపారంలో, వాణిజ్యంలో వాటా లేదు, పరిశ్రమలలో స్థానం లేదు. 
దళిత జాతికి ఉన్న ఆస్తి కేవలం చదువుకున్న వాళ్ళే. 
కానీ అట్టడుగు దళిత జ్యాతి శాశ్వత విముక్తి ఇంకా కలగానే మిగిలింది 
పైగా అంబెడ్కర్ ఉద్యమ విజయ ఫలాలు ఒక్కొక్కటిగా చేయి జారిపోతున్నాయి. 
ఇంతవరకు దళితుల పట్ల సమాజం చూపుతున్న వివక్ష నేడు ద్వేషంగా మారిపోయింది.కాబట్టి ఎన్ని చట్టాలు వచ్చినా అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది. 
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు :
విద్యావంతులు అనేకమంది, ఉద్యోగులు అతికొద్దిమంది అయి వీరంతా రాజకీయ శక్తిగా మారి అధికారంలోకి రావాలని ఓటు అనే శక్తివంతమైన ఆయుధాన్నిచ్చాడు బాబా సాహెబ్. 
ఈ ఆయుధం విలువ దళితులకు తెలియకుండా అగ్రకులాలు చాలా జాగ్రత్త పడుతున్నాయి. వారి సంస్కృతి మనపై రుద్దుతూ మనం ఓటు గురించి ఆలోచించకుండా చేస్తున్నారు. బాబా సాహెబ్ ఆలోచనలు మనదాకా రాకుండా పాఠ్యపుస్తకాలలో కేవలం రాజ్యాంగాన్ని రాసినవాడిగా మాత్రమే పరిచయం చేస్తూ నాలుగు లైన్లు రాస్తూ జాగ్రత్త పడుతున్నారు. 
కుట్రతో మనల్ని చదువులకు కాసిన్ని ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. 
రాజ్యాంగంలో రేజర్వేషన్లతో పాటుగా సమస్త హక్కులు కల్పించాడు బాబా సాహెబ్... 
వాటిని అమలుచేసుకోవడానికి రాజకీయ శక్తిగా ఎదగమన్నాడు. 
దేశంలోని సమస్త సంపదలో 100% సమానవాటా పంచుకోమన్నాడు. 
దళిత ఉద్యోగులు, విద్యావంతులు ఇకనైనా ఆలోచించండి 
బాబా సాహెబ్ పుస్తకాలు అధ్యయనం చేయండి, రాజకీయ శక్తిగా ఎదిగి సమస్త సంపదలో సమాన వాటా మనమే పంచుకుందాం. 
దళితుల, బహుజనుల అభివృద్ధికి శాశ్వత పరిస్కారం దిశగా అడుగులు వేద్దాం. 
అంబెడ్కర్ అంటే కొందరికి దళిత నేత, మరికొందరికి స్వాతంత్ర పోరాట నాయకుడు, ఇంకొందరికి స్వాతంత్రమొచ్చాక కేంద్ర మంత్రి... 
కానీ వీటన్నిటికీ మించి ఆయన ఒక దార్శనికుడు 
భవిష్యత్ తరాన్ని ఊహించిన మేధావి, దశబ్దాల క్రితం ఆయన గుర్తించిన సమస్యలు ఇప్పటికి మన దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి 
వాటిని పట్టించుకోకపోతే ఏమవుతుందో కూడా ముందే హెచ్చరించారు బాబా సాహెబ్ అంబెడ్కర్. 
ఇప్పటికి ఆయన అంటే మీకు చిన్న చూపు ఉందా..? 
అయితే ఆయన కోరుకున్న సమానత్వం విచక్షణ పోనట్టే.. !!
మరి మనమేమి విజయాలు సాధిస్తాం.. !
దేశం ఎలా తలెత్తుకుంటుంది.. !!
ఆయన్ను ఇప్పటికి మీరు ఒక తక్కువ కులం వ్యక్తిగానే చూస్తే అంతకంటే మనకు ఇంకేం సాక్ష్యం కావాలి? 
మనం దేనికి విలువిస్తామో తెలిసిపొఇంది కదా.. !!
మనం ప్రజ్ఞకి, జ్ఞానానికి కాదు కులానికి ఎక్కువ విలువ ఇస్తాం అని.. !!
బహుశా ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించడానికి జాతికి మరో వందేళ్లు పట్టొచ్చు. 
అయినా సరే 
ఆయన చెప్పినట్టు ఇప్పటికి నేను కూడా గర్వాంగా చెప్పగలను 
నేను నా దేశం.. ఇందులో "నాకు నా దేశమే ముఖ్యం"
మేర భారత్ మహాన్, 
వందేమాతరం, 
✊️జై భీమ్✊️ 
✊️జయహో డా : భీమ్ రావ్ రాంజీ  అంబెడ్కర్ సాబ్ 
✊️జయహో బహుజన✊️