విజేఫ్  ఆధ్వర్యంలో భద్రతా  సామగ్రి పంపిణీ

కరోనా లో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం
విజేఫ్  ఆధ్వర్యంలో భద్రతా  సామగ్రి పంపిణీ
విశాఖపట్నం, :  కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న  సేవలు ప్రశంసనీయమని 
బాల సతీష్ కొనియాడారు,,, సోమవారం ఇక్కడ విజేఫ్  వినోద వేదికలో పలువురు ఎలక్ట్రానిక్.. ప్రింట్ మీడియా జర్నలిస్టులకు.. వీడియో గ్రాఫర్ లకు.. న్యూస్ ప్రెజెంటర్స్ కు,,ఫోటో జర్నలిస్ట్ ల కు . అవసరమైన భద్రతా సామగ్రి అందజేశారు,.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మాస్క్.లు . 
సానిటైజ ర్లు ..గ్లౌజ్ లు ... ఎలక్ట్రానిక్ మీడియా కి అవసరమైన లైవ్ స్టిక్ లు..  అందజేశారు... బాల సతీష్ మాట్లాడుతూ..కరోనా . ప్రారంభం నుంచి కూడా తమ సంస్థ ద్వారా పలువురు కి చేయూత  అందిస్తున్నామన్నారు..
భవిష్యత్తులో కూడా తమ సేవలు కొనసాగుతాయన్నారు,,, మరిడి   సంస్థ డైరెక్టర్ శివాజీ మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం సమాజం కోసం పాటుపడుతూ ఉన్నారన్నారు... జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు సహకారము అందించాల్సిన అవసరం ఉందన్నారు,,,ఈ  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు జర్నలిస్టుల కు సంబంధించి ఆరు విడతలుగా అనేక రకాల భద్రతా సామాగ్రి ని  సమగ్రంగా  అందచేశామన్నారు... జర్నలిస్టుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు..జర్నలిస్ట్ ల కు . తక్షణమే 50 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని శ్రీనుబాబు కోరారు.. విజేఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు  మాట్లాడుతూ   దశలవారీగా తమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు... ఇప్పటికే  జర్నలిస్ట్ ల కు అవసరమైన సామాగ్రి ని దశల వారీగా  అందజేసామన్నారు..  ఈ కార్యక్రమంలో విజేఫ్  ఉపాధ్యక్షులు అర్. నాగరాజు పట్నాయక్ 
జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్..
కార్యవర్గం సభ్యులు ఇరోతి  ఈశ్వరరావు, ఎమ్ ఎస్ ఆర్ ప్రసాద్,  దొండ గిరిబాబు..జామి  వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image