విజయవాడ
సిపిఐ రామకృష్ణ
కరోనాతో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ప్రభుత్వానికి సహకారం అందించాలని భావించాం
లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో లో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి
లక్షల మంది కార్మికులు పనులు లేక కుటుంబాలతో పస్తులు ఉంటున్నారు
5.30కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి
యేడాది వరకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు
కానీ పొట్ట చేత పట్టుకుని ఊరు కాని ఊర్లకు వలసలు పోతున్నారు
ఆకలితో అలమటిస్తున్న నిరు పేదల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి
భవన నిర్మాణ కార్మికులకు పక్క రాష్ట్రాల్లో ఐదు వేలు ఇచ్చారు
ప్రతి పేదవానికి కేంద్రం నుంచి ఐదు వేలు, రాష్ట్రం నుంచి ఐదువేలు చొప్పున పదివేలు ఇవ్వాలి
వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి
రైతులు కష్టపడి పండించి పంట ను అమ్ముకునే పరిస్థితి లేదు
అప్పులు తెచ్చి సాగుచేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
ఆత్మహత్య లు చేసుకునే ప్రమాదం ఉన్న నేపధ్యంలో లో రైతంగానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
ప్రతి గ్రామంలో ధాన్యం సేకరణ కేంద్రం ఏర్పాటు చేయాలి
కరోనా మహమ్మారి తో వైద్యులు, నర్సులు పోరాటం చేస్తున్నారు
ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యులు, నర్సులకు కరోనా సోకింది
కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
ఇరవై లక్షల జీవిత భీమాతో పాటు, అదనంగా పదివేల రూపాయలు ఇవ్వాలి
ఈ ఐదు వర్గాల వారిలో మనోధైర్యం కల్పించేలా సిపిఐ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది
ప్రభుత్వం కూడా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి కరోనా పై పోరును విస్తృతం చేసేలా చూడాలి
తొలుత ప్రభుత్వం కరోనాను ఈజీ గా తీసుకున్నది వాస్తవం
ఆలస్యం గా అయినా చర్యలు చేపట్టారు.. ఇటీవల కరోనా కేసులు బాగా పెరిగాయి
కరోనా పై కలిసికట్టుగా పోరాడేలా సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలి