సియం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ఏపి పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు టిడిపి ఎమ్మెల్సీ వైవిబి

*కృష్ణ జిల్లా (విజయవాడ)*


_*సియం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ఏపి పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు టిడిపి ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్*_


కరోనా విధుల్లో పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను మీ ప్రభుత్వం ఆదేశించింది. 


*కానీ గత 45రోజులుగా మేము నిధులను వినియోగించు కోకుండా నిషేధం విధించి ఫ్రీజింగ్ లో పెట్టారు.*


కేంద్రం ఇచ్చిన నిధులు, మా సొంత నిధులపై కూడా ఈ ఫ్రీజింగ్ కొనసాగుతుంది. 


*సియంఎస్ఎస్ విధానంలో గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి.*


20రోజుల క్రితమే 14వ ఆర్ధిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు 870కోట్లు, మున్సిపాలిటీలకు 441కోట్లు విడుదల చేసింది. 


_*ఈ నిధులను కరోనా పనులకు వాడాలని కేంద్ర ఆర్ధికమంత్రి చెప్పినా..రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది.*_


14వ ఆర్ధిక సంఘం నిధులు 1311కోట్లు, మా సిబ్బంది వసూలు చేసిన పన్నుల నిధులు 2500కోట్లు మొత్తం 3811కోట్లు సొంత అవసరాలకు వాడేశారు


*కరోనా విపత్తు నుంచి గ్రామాలు, పట్టణాల ప్రజలను రక్షించేందుకు బ్లీచింగ్, ఫినాయిల్, కొనేందుకు కూడా మన వద్ద నిధులు లేవు.*


పంచాయితీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్ లు గత రెండు నెలలుగా అప్పులు చేసి, సొంతడబ్బులతో పనులు చేయిస్తున్నారు. 


*కొన్ని ప్రాంతాలలో అవి కూడా చేయించలేక ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.* 


పంచాయితీలు, మున్సిపాలిటీలలో శానిటరీ సిబ్బందికి నెల నుంచి రెండు నెలల జీతాలు ఇవ్వలేదు.


*కరోనా మహమ్మారిని ఎదుర్కుంటూ ప్రజలను రక్షిస్తున్న పారిశుద్ద్య సిబ్బందికి మాస్క్ లు, గ్లౌజులు, పిపిఇ కిట్లు అందించలేకపోయారు.*


కేంద్రం పంపిన నిధులు ఉన్నా కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది 


*ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.*


గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల నిధుల వినియోగం పై ఉన్న ఫ్రీజింగ్ ను వెంటనే ఎత్తివేయాలి.


*కరోనాను ఎదుర్కొనేందుకు, పారిశుధ్ద్య సిబ్బంది కోసం బ్లీచింగ్, ఫినాయిల్, మాస్క్ లు, గ్లౌవుజులు, పిపిఇ కిట్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.*


పారిశుధ్య సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు చెల్లించడంతో పాటు మరో నెల జీతం అడ్వాన్స్ గా ఇవ్వాలి.


*ఇటువంటి కఠిన వాస్తవాల గురించి మాట్లాడిన నగర మున్సిపల్ కమిషనర్ వెంటకరామిరెడ్డిని సస్పెండ్ చేశారు.*


ప్రజా సంక్షేమం కోసం వాస్తవ సమస్యలు ఎత్తిచూపితే అధికారులను సస్పెండ్ చేయడం సమంజసమా..?


*రామిరెడ్డి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.*


కరోనాను ఎదుర్కొనేందుకు వీలైతే రాష్ట్ర ప్రభుత్వమే తన సొంతనిదులను గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చి ఆదుకోవాలి


*కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మల్లించి మీ సొంత అవసరాలకు వాడుకోవడం అన్యాయం.*


పారిశుధ్య పనులు, బ్లీచింగ్ కూడా చల్లలేని దుస్థితిలోకి మా స్థానిక సంస్థలను నెట్టివేయవద్దని ఏపి పంచాయితీ రాజ్ ఛాంబర్ తరుపున మనవి చేసుకుంటున్నాం...


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image