నన్ను..క్షమించండి

*నన్ను..క్షమించండి!*


*రాష్ర్ట ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ ....*


1.ముస్లిం సోదరులకు, ముస్లిం గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
నిన్న తిరుపతిలో మాట్లాడే సమయంలో.. కరోనా పాజిటివ్ కేసులు రావడం గురించి మాట్లాడాను. దానిపైన ముస్లింలను  విమర్శించాలని ఆత్మసాక్షిగా నాకు లేదు.


2.నేను కూడా దళితుడ్ని. నాకు ఎస్సీలు, ఎస్టిలు, బిసిలు మైనారిటీలు అందరూ కూడా ఒకే కులస్తులుగా భావించేవాడ్ని. మనందరం సమాజంలో చాలా వెనకబడినవారం.


3.ఈరోజు వెనకబడిన వర్గాలకోసం రాజకీయ సమానత్వమే కాకుండా రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్దికంగా ఆ వర్గాలను పైకితెస్తూ కులవ్యవస్దను, మతవ్యవస్దను దూరం పెట్టిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.


4.ఒక కులంమీద గాని, మతం మీద గాని దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. వారి మత గురువులు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే దానిని పాటించే అలవాటు అన్ని మతస్తులకు ఉంది. అదే విధంగా ఢిల్లీలో జరిగిన  సంఘటన ఇతర దేశాలనుంచి వచ్చిన వారి వల్ల పాజిటివ్ కేసులు వచ్చాయి. 


5.అదే విధంగా ఏ మతస్తులు సభలు పెట్టుకున్నాగాని, క్రిష్టియన్ సభలు పెట్టుకున్నాగాని వేరే మతస్తులు గురువులు వచ్చినప్పుడు వాటిక్కూడా బయట దేశస్దులు వస్తే కరోనా పాజిటివ్ రావడం సహజం. అదే విధంగా హిందుమతానికి సంబంధించి ధార్మికమైన మతగురువులు సందేశాలు ఇచ్చేటప్పుడు విదేేశాలనుంచి వస్తే కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.


6.అందుకని నేను నిన్న పూర్తిగా మైనారిటీ అనే వారు ఏదైనా ప్రసాదం తీసుకుంటే అది కిందపడకుండా స్వీకరించే సాంప్రదాయం దేవుని పైన భక్తితో వారిలో ఉంది. అదేవిధంగా ఇతర మతస్తులు తీర్ధం తీసుకున్నప్పుడు కిందపడకుండా తీసుకునే అలవాటు ఉంది. ముఖ్యంగా నాకు ముస్లింలపై ఎలాంటి ద్వేషం లేదు- ఎలాంటి పగలేదు.


7.నేను మొదటి నుంచి కూడా ముస్లిం సోదరులతోనే ఉండేవాడ్ని. నా రాజకీయ చరిత్రలో కూడా 1981లో హబీబ్ అనే అతనిని సర్పంచ్ గా పోటీ పెట్టించాను. అప్పుడు ఆయన ఓడిపోయినా ఎంకరేజ్ చేశాను. వారి ఇళ్ల స్దలాల విషయంలో గాని వారి సామాజిక అంశాల విషయంలోగాని వారిలో ఒక వ్యక్తిగా కలసిమెలసి వెళ్లే అలవాటు నాకు ఉంది.


8. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు ఎటువంటి పదవులు ఇచ్చారు. ఈ సమాజంలో వారిని ఏవిధంగా పైకి తీసుకువచ్చారో కూడా మీ అందరికి తెలుసు.


9.నిన్న నా మాటలు చాలామందికి  బాధాకలిగినట్లు తెలిసింది. ముస్లిం మతస్ధులు కూడా డిప్యూటి సిఎం గా ఉన్న వ్యక్తి మతపరంగా మాట్లాడటం చాలా దారుణం అని బాధపడ్డారని తెలిసింది.


10. నేను వారిని బాధించే విధంగా ఏదైనా మాట్లాడి ఉంటే  నా ఆత్మసాక్షిగా నన్ను మన్నించాలని ముస్లిం మతగురువులను, ముస్లిం మతస్దులను కోరుతున్నాను. ఎందుకంటే మనమంతా మానవులం. ఇండియాలో పుట్టినవాళ్లం. మనం అందరం ఒకే వర్గానికి చెందినవారం. మతద్వేషంగాని, కులద్వేషంగాని నాలో ఎప్పుడూ లేదు.


11.నేను అప్పీలు చేస్తున్నాను. ఎటువంటి పరిస్దితులలో కూడా ముస్లింల మనస్సు బాధించే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినేటట్లు ప్రవర్తించను. జరిగిన దానికి బాధపడుతున్నాను. ముస్లిం సోదరులు, వారి మతగురువులు నన్ను క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


12.మతం, కులం అని లేకుండా మనమందరం సోదరభావంతో కలసిమెలసి ఉండాలని ప్రార్దిస్తున్నాను.


13.ఈ విషయంలో ముఖ్యమంత్రి  నాతో ఈరోజు కూడా ఈ అంశంపై మాట్లాడారు. వారి ఆలోచన ప్రకారం ఏ విధమైన మతద్వేషంగాని, కులద్వేషంగాని ఉండకూడదు.


14.అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులందరికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఏ కులస్తులకు కూడా దూరంగా లేరు. ముందుగా వారి తండ్రి వైఎస్సార్ గారు కూడా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది.


15.నేను మతద్వేషం రెచ్చగొట్టేంత నీచమైన వ్యక్తిని కాను. నన్ను మనస్పూర్తిగా క్షమించాలని కోరుతున్నా...


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..