కరోనా విపత్తులో నాయీబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి:: నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు

కరోనా విపత్తులో నాయీబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి:: నాయీబ్రాహ్మణ జేఏసీ;


^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^


కరోనా విపత్తు లాక్ డౌన్ లో బార్బర్ షాపులు బంద్ చేయటం ద్వారా రెక్కాడితే కానీ డొక్కాడని నాయీబ్రాహ్మణ వృత్తిదారులు, శుభకార్యాలు లేక మంగళ మంగళ మేళతాళాలు మూగబోయి, దేవాలయాలలో తలనీలాలు తీయించుకునే భక్తులు లేక క్షురకుల జీవనం అగమ్యగోచరంగా మారి దిక్కుతోచనిస్థితిలో ఉన్న నాయీబ్రాహ్మణ లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నేడొక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.


హిందూ దేవాలయాలలో పూజారులను, చర్చిలలో ఫాదర్స్ ని, మసీదులో ఇమాం లను ప్రభుత్వం ఆదుకుని ఏ పూటకు ఆపూట వృత్తిని నమ్ముకుని జీవించే నాయీబ్రాహ్మణ లను ఆదుకోకుండా ప్రభుత్వం వివక్షత కు గురిచెయ్యటం సరికాదని, ఆకలి కేకలతో ఆకలి చావులకు గురికాక ముందే క్షవర వృత్తిదారులను యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నాయీబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని నరసింహారావు ఆవేదన చెందారు.


సంక్షేమ పథకాలు తో ముడిపెట్టకుండా కరోనా లాక్ డౌన్ లో నాయీబ్రాహ్మణ డకు గ్రామస్తాయిలో 10 వేలు,పట్టణ నగర స్థాయిలో 15 వేల రూపాయిలు సహాయం అందించి ఆదుకోవాలని, కరోనా సంక్షోభం ముగిసేవరకు బార్బర్ షాపుల అద్దెలు,ఇంటి అద్దెలు పూర్తి రాయితీ ఇవ్వాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ బార్బర్ షాపులకు250 యూనిట్స్ కరంటు రాయితీ ఈ సందర్భంగా అమలు చేయాలని కోరారు.


ప్రతి బార్బర్ షాప్ కి ఒక స్టజిలేజర్, p p e కిట్టు ఒకటి అందించి లాక్ డౌన్ లో 6am to 9am వరకు టైం సడలింపు విజ్ఞప్తి చేసారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి,ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి నాయీబ్రాహ్మణ లకు సమస్యల గురించి విన్నవించటం జరిగిందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలు వెంటనే స్పందించి ఆదుకోవాలని ఆంద్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు ప్రభుత్వాలను డిమాండు చేశారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image