కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*21–04–2020*
*అమరావతి*


అమరావతి: కోవిడ్‌–19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు.కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం.ఈ జిల్లాల్లో మరిన్ని పరీక్షలు, మరిన్ని చర్యలకు సీఎం ఆదేశం.అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.మాస్క్‌ల పంపిణీ ఊపందుకుందన్న అధికారులు.మాస్క్‌లను రెడ్, ఆరెంజ్‌ జోన్లకు ముందు పంపిణీ చేస్తున్నామన్న అధికారులు.రాష్ట్రంలో టెస్టులు బాగా జరుగుతున్నాయన్న అధికారులు.విశాఖపట్నంలో టెస్టులు బాగా జరుగుతున్నాయన్న అధికారులు.విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలో కేసులు నమోదుకాలేదన్న అధికారులు.


ట్రూనాట్‌కిట్స్‌ ద్వారా ఇక్కడకూడా పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్న అధికారులు . 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్న అధికారులు.నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కోవిడ్‌ –19 పరీక్షలు ( ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా).కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం.గవర్నమెంట్‌ ఆస్పత్రిలో ఉన్న వారిని మిగతా ఆస్పత్రులకు మార్చామన్న అధికారులు.ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరామన్న అధికారులు.


పీపీఈలను, మాస్క్‌లనుకూడా అవసరాలకు అనుగుణంగా ఉంచుతున్నామన్న అధికారులు


కేసులు ఎక్కువ ఉన్నచోట  స్టాక్‌ను అధికంగా ఉంచుతున్నామన్న అధికారులు


సమగ్ర సర్వేలద్వారా గుర్తించిన 32వేలమందిలో ఇప్పటికే 2వేలకుపైగా పరీక్షలు చేశామన్న అధికారులు


మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు


క్వారంటైన్‌ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారన్న అధికారులు


*పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం*


*దూకుడుగా కొనుగోళ్లు జరపాలి, రైతులకు అండగా నిలబడాలి.దీనివల్ల చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి సమసిపోతాయి.లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులకోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడినట్లు.   సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.


అన్నిరకాలుగా ఆదుకుంటామని,  వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ చెప్పినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.