సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు కోసం చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు చెయ్యడం జరుగుతుందన్నారు.
 హార్టికల్చర్ ఉత్పత్తులు పై చర్చ సందర్భంగా, కడప, అనంతపురం జిల్లాలో పంటలు హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళతాయి. టమాట ,అరటి ఉత్పత్తులను సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు
వ్యవసాయ , అనుబంధ రంగానికి సంబంధించి యంత్ర పరికరాలను రవాణాను అడ్డుకోవద్ద ని,  భారత ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్వారా  జిల్లా కలెక్టర్ లకు సూచనలను చెయ్యడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతులు సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యవసాయ కోత పనులు చేపట్టేందుకు వీలు ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు కూలీలను, అనుబంధ వ్యక్తులను అనుమతించేందుకు కలెక్టర్ లు చొరవ చూపాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించడం జరిగింది..
ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య,  పి.వి.రమేష్, కె ఎస్. జవహర్ రెడ్డి, సతీష్ చంద్ర, గిరిజా శంకర్, కె. భాస్కర్, జి వి ఎస్ ఆర్ కె విజయకుమార్, కోన శశిధర్, చిరంజీవి చౌదరి, హెచ్.అరుణ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, మల్లిఖార్జున్, కృష్ణ బాబు,  కె. కన్నబాబు, కె.విజయ, తదితరులు పాల్గొన్నారు.