కరోనా ఏమైనా మీ చుట్టమా..? ‘‘వస్తుంది, పోతుంది’’ అనడానికి..? : యనమల ధ్వజం

కరోనా ఏమైనా మీ చుట్టమా..? ‘‘వస్తుంది, పోతుంది’’ అనడానికి..?
-మరణాలు దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుంది.
-ఒక ప్రకటనలో సీఎం జగన్ పై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
కరోనా కట్టడిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తలలు పట్టుకుంటున్నారు. నియంత్రణపై ఏం చేయాలి, ఎలా చేయాలని జుట్టు పీక్కుంటున్నారు. వ్యాక్సిన్ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తలమునకలుగా ఉన్నారు. జర్నలిస్ట్ లు, రచయితలు కథనాలు రాస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నారు.  
సీఎం జగన్ మాత్రం దానినేదో చిన్న జ్వరంగా, కరోనాతో ప్రమాదం లేదన్నట్లుగా చెప్పడం ఆత్మ వంచన, ప్రజలను వంచించడమే.
కరోనా జగన్ కు చుట్టంలా ఉంది. చుట్టంలా ‘‘వస్తుంది...పోతుందని’’ అంటున్నారు.
ఆఖరి రోమ్ చక్రవర్తి నీరో కొత్త నగరం కడదామని రోమ్ ను తానే తగుల పెట్టాడని, ఆ మంటలను చూస్తూ ఫిడేలు వాయించాడనే ప్రచారం ఉంది. 
కరోనాతో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నా, అది చిన్న ఫ్లూ లాంటి దేనని సీఎం జగన్ చెప్పడం ఈ కోవలోదే. 
చిన్న జ్వరం లాంటిదని చెప్పడం జగన్ సైకాలజికి దర్పణం:
కరోనా, లాక్ డౌన్ లతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, కుటుంబ స్థితిగతులు చిన్నాభిన్నం అవుతుంటే, వాటిని నిర్లక్ష్యం చేసి అదేదో చిన్నజ్వరంగా జమకట్టడం జగన్ సైకాలజికి దర్పణం.
రాజకీయ లాభాల కోసం ప్రజల ప్రాణాలనే బలిపెట్టడం ఫ్యాక్షనిజానికి పరాకాష్ట.
దేశంలో రోజుకు సగటున 1500 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 80కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. దేశంలో కరోనా ఎక్కువ ఉన్న 15జిల్లాలలో ఏపి జిల్లా(కర్నూలు) కూడా చేరింది. ఇవేమీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు.
సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే మొదట్లో యంత్రాంగం తేలిగ్గా తీసుకుంది. ఇప్పుడీ దుస్థితికి స్వయంగా కారకుడు సీఎం జగన్.
కరోనా కేసుల సంఖ్యలో దేశంలో 8వ స్థానంలో ఏపి ఉంది. కరోనా మరణాల్లో 6వ స్థానంలో ఉంది. తూర్పు తీర రాష్ట్రాలలో 2వ స్థానంలో ఉంది. 
కరోనా వృద్దిరేటులో దేశంలో 2వ స్థానంలో ఏపి ఉంది. డిశ్చార్జ్ డ్ కేసులలో అడుగునుంచి ఏపి 2వ స్థానంలో ఉంది. కేసులు ఎక్కువ ఉన్నా తమిళనాడులో మరణాలు మనకన్నా తక్కువ.
వారం రోజుల్లోనే ఏపి తెలంగాణను ఓవర్ టేక్ చేసింది. తమిళనాడును త్వరలోనే ఏపి ఓవర్ టేక్ చేసేలా ఉంది. 
కరోనాపై వాస్తవాలను వైసిపి నేతలు తొక్కేస్తున్నారు. ఎక్కువ టెస్టింగ్ లని డబ్బా కొడుతున్నారు. ఎక్కువ పరీక్షల వల్లే కేసులు ఎక్కువని చెప్పడం ఆత్మవంచన, రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. 
రికవరీలో మన రాష్ట్రం అట్టడుగున ఉంది.
దేశంలో బెస్ట్ రికవరీ స్టేట్స్ కేరళ 98.8%, హర్యానా 98.3%, తమిళనాడు 97.7% వుంటే ఏపి 4.7% మాత్రమే ఉంది. కనిష్ట రికవరీ రాష్ట్రాలలో ఏపి ఒకటి. 
డిశ్చార్జ్ రేటులో అడుగునుంచి 2వ స్థానంలో ఏపి:
దక్షిణాదిన డిశ్చార్జ్ రేటులో తమిళనాడు 1,210తో తొలిస్థానంలో ఉంటే, తెలంగాణ 409తో 2వ స్థానం, కేరళ 369తో 3వ స్థానం, ఏపి 287తో అడుగునుంచి 2వ స్థానంలో ఉంది. కర్ణాటక 216తో చివరి స్థానంలో ఉంది. 
ఇందులోనే వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం బైటపడింది. ఏదో చేస్తున్నట్లు ప్రకటనలే తప్ప ఆచరణలో సున్నా. 
కరోనా మరణాలను దాచిపెడుతున్నారు. మరణాలను దాచేస్తే కరోనా రాష్ట్రాన్నే కాల్చేస్తుంది. కరోనా కార్చిచ్చులో ప్రజలను బలి పెట్టకండి.
రోజురోజుకు కేసులు రెట్టింపు కావడం ఏపిలో పెరిగిపోతుంటే, కేరళ, తెలంగాణ, తమిళనాడులో తగ్గుతున్నట్లు అధ్యయనాలే పేర్కొన్నాయి. వైసిపి నాయకులే గుంపులుగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారనే దానికి ఈ అధ్యయనాలే ప్రత్యక్ష రుజువులు. వైసిపి నిర్వాకాల వల్లే శ్రీకాళహస్తి, నరసరావు పేట వంటి చిన్న పట్టణాలు కూడా కరోనాతో విలవిల్లాడుతున్నాయి.  
వైసిపి నేతల ట్రాక్టర్ల ర్యాలీలు, ప్రారంభోత్సవాల్లో జనం గుంపులతో పూలు జల్లించుకోడాలు, బహిరంగ సభలు పెట్టడాన్ని కేంద్రమంత్రులే తప్పు పట్టారు.
కేరళలో రూ 20వేల కోట్ల ప్యాకేజి ప్రకటించారు. ఏపిలో పైసా ప్యాకేజి ప్రకటించలేదు. కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లించారు. కాంట్రాక్టర్ల చెల్లింపులకే కరోనా కన్నా ప్రాధాన్యం. రోగ నివారణ కన్నా రంగులేయడంపైనే వైసిపి శ్రద్ద.
వలస కూలీల బాధలు సీఎం జగన్ కు కనిపించవు. భవన కార్మికుల ఆకలి కేకలు వినిపించవు. రైతుల ఆవేదన ఆయనకు తెలియదు. ‘‘నేను ఉన్నాను, నేను విన్నాను’’ అని ఓట్లడిగింది ఇందుకేనా అని జనమే ప్రశ్నిస్తున్నారు. 
వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. 
యనమల రామకృష్ణుడు
(శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత)


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image