పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ

*పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ*


గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం క్రోసూరులో   గురువారం రోజు *పోలీసులు దాడిలో ఒక  వ్యక్తి అపస్మారక  స్థితి అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సత్తెనపల్లి డిఎస్పీ తీవ్రంగా ఖండించారు*


గత కొన్నిరోజులుగా క్రోసూరు మండల కేంద్రంలో  పొలాలలో *పేకాటరాయుళ్లు విచ్చలవిడిగా పేకాడుతున్నాట్లు గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారాన్ని ఫోన్ ల ద్వారా, వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్న తరుణంలో* గురువారం రోజు పక్కా సమాచారం అందుకున్న లోకల్ SI ఆనంద్ పొలాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. 


పోలీసుల రాకను గమనించిన పేకాటరాయుళ్లు సుమారు 30 నుండి 40 మంది వరకు తమ స్థావరాల నుండి తప్పించుకోవడానికి *పరుగులు తీశారని* అందులోని వారిని 8 మంది పట్టుకొని అరెస్టు చేయటం జరిగిందని డిఎస్పీ తెలిపారు.


*అక్కడే ఉన్న పేకాట చూస్తున్న పెద్దాయన పరుగు తీయలేక చేలో పడిపోయాడని ఆయన తెలిపారు*


 ప్రాధమిక  విచారణలో ఇతనికి ఆరోగ్యరీత్యా అనారోగ్యంతో బాధపడుతూ గతంలో గుంటూరు రామసుబ్బారెడ్డి వైద్యశాల.  కారుమూరి వైద్యశాలల్లో, నరసరావుపేట GBR వైద్యశాలల్లో,  సత్తెనపల్లి సంజన వైద్యశాల శ్రీధర్ వద్ద పరీక్షలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.


ప్రస్తుతం క్రోసూరు నుండి అతన్నీ సత్తెనపల్లి మహేశ్వరెడ్డి వైద్యశాలలో  చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.


ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఇతను బ్యాక్ పెయిన్, నరాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని డిఎస్పీ వివరించారు.


క్రోసూరు లో అదే ప్రాంతాని చెందిన చర్చి ఫాస్టర్ జేమ్స్ మాట్లాడుతూ గతంలో నేను వైద్యం ఇతనికి వైద్య సహాయం కోసం వైద్యులకు చూపించినట్లు సత్తెనపల్లి వైద్యశాల. వద్ద విలేకరులతో తెలిపారు.


విలేకరుల సమావేశంలో  పట్టణ CI విజయచంద్ర, క్రోసూరు SI ఆనంద్,  క్రోసూరు చర్చి ఫాస్టర్ జేమ్స్ మరియు సిబ్బంది ఉన్నారు.