మండల సరిహద్దుల పహరాలో ప్ర్ర్రత్యేక మొబైల్ బృందాలు

సరిహద్దుల పహరాలో ప్ర్ర్రత్యేక మొబైల్ బృందాలు.


వింజమూరు, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైర్రస్ నానాటికీ విస్తరిస్తున్న తరుణంలో వింజమూరు మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉన్నప్పటికీ మున్ముందు కూదా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాకుండా మండల టాస్క్ ఫోర్స్ ప్రత్యేకాధికారులు పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టారు. కొండాపురం మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ మండల వాసులు వింజమూరుకు రాకపోకలు సాగించడంపై నిషేదం విధించారు. అంతేగాక ఇతర ప్రాంతాల నుండి సైతం వింజమూరు మండలంలోకి ఎవరూ రావద్దంటూ అధికారులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మండల సరిహద్దుల్లో 6 చోట్ల వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నివారించే దిశగా పలు శాఖల సిబ్బందిని నియమించారు. బంగ్లాసెంటర్ చెక్ పోస్టు వద్ద మంగళవారం నుండి తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ బృందంలో వెలుగు ఏ.పి.యం శ్రీనివాసరావు, వి.ఆర్.ఓ కె.వెంగయ్య, సచివాలయ ఉద్యోగులైన గ్రామ సర్వేయర్ సి.హెచ్.నాగశివ,, మహిళా పోలీసు మాధవి, వెటర్నరీ ఉద్యోగి జి.మహేశ్వర్, వి.ఆర్.ఏ సుందరయ్య, వి.ఏ.ఏ ఎస్కే.హిమాం సాహెబ్, చెక్ పోస్టు సిబ్బంది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.