ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం :భూగర్భగనులశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


24.4.2020 
అమరావతి 


రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులశాఖామంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటన లో ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయ్యేరని  ఎపి రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు అని అన్నారు.- గత ఎన్నికల్లో పొరపాటుగా టిడిపికి 23 అసెంబ్లీ, 3 ఎంపి స్థానాలు వచ్చాయి.- ప్రజా విశ్వాసంను కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఇకపై అవికూడా రావు.- రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వుండదు. - ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడు. - హైదరాబాద్ లోని ఇంటిలో కూర్చుని బయటకు రాకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.- కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?- ప్రజలకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జవాబు చెప్పుకోవాలి.- ఒకవైపు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు.- కానీ రాష్ట్రప్రభుత్వం చేసే ప్రతి పనిని చంద్రబాబు బూతద్దంలో తప్పుగా చూస్తు విమర్శలు చేస్తున్నాడు.- ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నాడు.- చంద్రబాబు అబద్దపు మాటలు నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరు.- ప్రతిపక్ష నేతగా కరోనా సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి.- కానీ దానికి భిన్నంగా చంద్రబాబు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాడు.- ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలి.- రాష్ట్రంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యల వల్ల కోవిడ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయి. 


- కోవిడ్ నేపథ్యంలో కేవలం నాలుగు వారాల్లో తొమ్మిది ల్యాబ్ లను ఏర్పాటు చేశాం. 


- దేశంలో సగటు పరీక్షల కన్నా మూడు రెట్లు అంటే రోజుకు 961 టెస్ట్ లు చేస్తున్నాం. 


- కోవిడ్ అనుమానిత వైద్య పరీక్షలు చేయడంలో దేశంలోనే మనం ప్రథమ స్థానంలో వున్నాం. 


- ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. 


- రాష్ట్రంలో 7900 మంది క్వారంటైన్ లో వున్నారు. వారికి అన్ని వసతులు అందుబాటులో వుంచాం. 


- దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు టెలిమెడిసిన్ ను ప్రారంభించారు. 


- సీఎంగారి పట్టుదలతో ప్రారంభించిన టెలిమెడిసిన్ లో 300 మంది వైద్యులు పనిచేస్తున్నారు. 


- 14400 నెంబర్ కు మిస్ట్ కాల్ చేస్తే చాలు వైద్యులు వైద్య సహాయం కోసం అందుబాటులోకి వస్తారు. 


- ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 మందికి కోవిడ్ పరీక్షలు చేశాం. 


- ముఖ్యమంత్రి ముందుచూపుతో ఇతర దేశాల నుంచి ర్యాపిడ్ కిట్ లను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారు. 


- చివరికి దీనిపైన కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాకులు, చెవాకులు మాట్లాడాడు. 


- ఐసిఎంఆర్ అనుమతితో జరుగుతున్న పరీక్షలపైన కూడా విమర్శలు చేయడం దారుణం. 


- రాష్ట్ర ప్రజలకు వరప్రదాయినిగా ర్యాపిడ్ టెస్ట్ లతో కోవిడ్ ను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. 


- చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయాలకు తావిస్తూ విమర్శలు చేస్తున్నాడు.


Popular posts
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
Image