విద్యార్థులకు అందే డ్రై రేషన్ పంపిణీలో  గోల్ మాల్

విద్యార్థులకు అందే డ్రై రేషన్ పంపిణీలో  గోల్ మాల్


,ఎమ్మిగనూరు,ఏప్రిల్,4 (అంతిమతీర్పు): -ఎమ్మిగనూరు నియోజకవర్గమైన గోనెగండ్ల మండలంలో ఉన్న ప్రతి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే డ్రై రేషన్ సరుకులు పక్కదారి పట్టాయని టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు రంగస్వామినాయుడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే జగనన్న గోరుముద్ద కరోనా వైరస్ కారణంగా విద్యార్థులకు మొదటి ఫేస్ కింద మార్చి 31 వరకు ఇవ్వాల్సిన డ్రై రేషన్ సరుకులను  గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డ్రైరేషన్ లో బాగంగా 1460 మంది విద్యార్థులు ఉండగా ఒక్కొక్క  విద్యార్థికి  బియ్యం 750 గ్రాములు,5కోడిగుడ్లు,5చిక్కీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 396 మంది విద్యార్థులకుమాత్రమే  ఒక్కొక్కరికి 5 కోడి గుడ్లు చొప్పునా 1980 గుడ్లు మాత్రమేఇచ్చారనిమిగతాగుడ్లుఅయిపోయాయని,అలాగే కేవలం గుడ్లు మాత్రమే ఇచ్చి 20 కింటాళ్లు బియ్యం,7300 కిచిడీలు విద్యార్థులకు అందాల్సి ఉన్న ఎందుకు పంపిణీ చేయలేదో సమాధానం చెప్పాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇచ్చినా గడువులోగా మీరూ ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ఇచ్చినా గుడ్లు కూడా టీచర్ల పర్యవేక్షణలో ఇవ్వలేదని అన్నారు.ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వలేదో లేక అమ్ముకున్నారోవిద్యార్థులకుతెలియజేయాలనివారు  డిమాండ్ చేశారు.కరోనా వైరస్ కారణంగాతల్లిదండ్రులకు పనులు లేక విద్యార్థులు పెనుభారం అవ్వకూడదని ప్రభుత్వం భావిస్తే, మీరూ అమలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.ఇక రెండవ ఫేస్ డ్రై రేషన్ సరుకులనువిద్యార్థులకు  ఇవ్వాలని ప్రభుత్వం 3న ఉత్తర్వులు ఇచ్చిందని, ఏప్రిల్ 1 నుండి 23 వరకు పనిదినములు 17 రోజులకు గాను 1-5తరగతుల విద్యార్థులకు బియ్యం 1 కిలో 700 గ్రాములు,గుడ్లు 14 చిక్కీలు 9,6-10తరగతుల విద్యార్థులకు బియ్యం 2 కిలోల 550 గ్రాములుగు.