కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం

అమరావతి ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు) :


కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ  వీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ కట్టుదిట్టమైన చర్యలతో కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనపడుతోందని పేర్కొన్నారు.కరోనా వైరస్ కేసులను దాచవద్దని, కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని అన్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించడం వంటి కారణాలు వల్ల ఎక్కువ కేసులు నమోదు అవుతాయని చెప్పారు.
హాట్ స్పాట్ ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇంతవరకూ కేసులు నమోదు కాకపోయినా ఇటీవల ఆయా జిల్లాల్లో కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయా జిల్లాల్లో కూడా లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.


 


ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,ఐజి వినీత్ బ్రిజ్లాల్,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.