తేది: 26.04.2020
అమరావతి, ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు) : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాంః వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు.పంట నష్టంపై అధికారులతో సమీక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అకాల వర్షాలు-పంట నష్టంపై అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాకబు చేశారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు .
పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం వివరాలను కురసాల కన్నబాబు వివరించారు.
*ప్రాథమిక సమచారం మేరకు వివిధ జిల్లాలో పంట నష్టం వివరాలు (హెక్టార్లలో)..*
జిల్లా పంట విస్తీర్ణం (హెక్టార్లలో)
ధాన్యం మొక్కజొన్న నువ్వులు వేరుశెనగ పొద్దుతిరుగుడు పొగాకు విస్తీర్ణం
శ్రీకాకుళం 40.00 0.00 0.00 0.00 0.00 0.00 40.0
విజయనగరం 64.00 200.00 60.00 0.00 0.00 0.00 324.00
విశాఖపట్నం 51.81 0.00 98.20 0.40 4.00 0.00 151.41
ప. గోదావరి 136.30 135.00 0.00 19.౦౦ 0.00 0.00 309.30
కృష్ణా 3525.25 34.00 0.00 4.00 0.00 0.00 3563.25
అనంతపురం 55.00 151.00 0.00 0.00 0.00 0.00 206.00
ఇక, తూర్పు గోదావరి విషయానికి వస్తే.. నేలకొరిగిన పంట .. 9337 హెక్టార్లు, పనలు మీద ఉండి వర్షం పాలైన పంట 1378 హెక్టార్లు, కట్టలు కట్టి ఉండిపోయిన పంట..883 హెక్టార్లు, నూర్పుడి కల్లాల్లో ఉన్న ధాన్యం 7191హెక్టార్లని గణాంకాలు వెల్లడించారు.