ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి
ఒక రైతు సేవకుడి బహిరంగ లేఖ


అత్యంత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి
నమస్కారములతో విన్నవించుకుంటున్న లేఖాoశాలు.


మహాశయా


కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఆతలాకుతలామ్ చేసి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ నేపథ్యంలో సమస్త భారతదేశాన్ని Covid 19 లక్ష పడగల రాక్షస సర్పంలా పెనవేసి కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో 13 జిల్లాల చిన్న రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ ని పరిరక్షించడానికి మీరు మీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  గుర్తిస్తూనే, అన్నపూర్ణగా దేశానికీ  ధాన్యగారంగా నీరాజనం అందుకున్న ఈ  స్యశ్యామల  సుక్షేత్రం మీద  రైతులు ఎడతెరిపి లేకుండా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను, వేదనలను, నేను లికిత పుర్వకముగా  మీ దృష్టికిని తీసుకు వస్తున్నాను. మీరు  రాజకీయ, సామాజిక,
వర్గ స్పృహలకి, అతీతంగా దీనిని స్వీకరిస్తారని  ఆశిస్తున్నాను.



ముఖ్యమంత్రి గారు,


ఈ భూమ్మీద పైరు పంటలు ప్రారంభమై 10 వేల సంవత్సరాలలో కరువు కాటకాలు, చిడ పిడలు, రైతులను తద్వరా అన్నానికి వారి మీద ఆధారపడే అన్ని వర్గల ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. కానీ, మన అదునిక ప్రభుత్వ యుగం మొదలై న తరువాత  ప్రకృతి విపత్తుల కి  సంబంధం లేని అస్తవ్యస్త వ్యవసాయ విధానాల కారణంగా రైతు కుంగి కునారిల్లు పోతున్న కటోరవాస్తవం. మీకు తెలియకుండా ఉండదు “అన్నం బహు కుర్వీత:” let there be abundant food అని ఋషి వాక్కు.


 


మనవంటి 70 శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రానికి రైతే మొదటి దిక్కు.  ఇప్పుడు కొనసాగుతున్న లాక్ డొన్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం  ఎదుర్కొంటున్నటు వంటి నరక ప్రాయ దుస్థితి మీద తగినంతగా దృష్టి సారించాల్సి ఉంది. నిజానికి  రైతు, రైతుకూలీల ది ఒక ప్రత్యేక ప్రపంచం అక్కడ అన్నీ మనం అనుకున్నంత ఆకుపచ్చగా, అందముగా ఉండవు. మీరు అధికారుల, శాసనసభ్యులు, మంత్రివర్యులు , కళ్ళతోనే కాకుండా రైతు ప్రపంచంలోని కి స్వయంగా వ్యక్తి  గతంగా  చూడండి.


మీ దృక్కోణం మీ ప్రాధాన్యతలు  మార్చు కొనే అవకాశం ఉంది. అందువల్ల మీరు రైతుకు ముఖ్యంగా రైతు బిడ్డలకు మీరు ఊహించనంత  మేలు జరుగుతుందని నా నమ్మకం.  సాక్షి దినపత్రికలో ప్రతిరోజు సంపాదకులు ప్రచురిస్తున్న వైయస్సార్ “quotations” నూటికి  80 శాతం రైతుల గురించే మరియు వ్యవసాయం గురించి ఉoటాయని గుర్తు చేస్తున్నాను



ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతు దుస్థితి గురించి జరుగుతున్న చర్చలు వాదోపవాదాలు మీ దృష్టికి రాలేదని భావించలేము వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న రైతులలో దాదాపు 75%
కౌలుదారులే.



కౌలుదారులకు ప్రభుత్వ సాయం అందటానికి సవాలక్ష అర్హతలు, అభ్యంతరాలు ముందుకు
వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ మాటకు వస్తే భారతదేశంలో అనాదిగా కౌలు వ్యవస్థ పరస్పర విశ్వాసం మీద, మన సాంప్రదాయం మీద, నోటి మాట ఒప్పందాల మీద, ఆధారపడి కొనసాగుతోంది. ఈ ఒప్పందానికి సాధారణంగా చట్ట బద్ధత, ఆధారం ఏమీ ఉండదు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? వందలాది  కొత్త నిర్ణయాలు కొత్త కొత్త ఉత్తర్వులు తీసుకొస్తున్నా ముఖ్యమంత్రిగా మీరు మన రాష్ట్రంలో నానాటికీ  కుంగిపోతున్న కౌలుదారులను ఉద్ధరించడానికి అవసరమైన చర్యలు చేపట్ట లేరా?


 


యాజమాన్య హక్కు పత్రాలు చూపించకపోతే కౌలుదారు పండించిన పంటకి విక్రయం
గాని,  కొనుగోలు గాని,  కుదరదంటే ఆ రైతు ఏ వ్యవసాయ బావిలో దూకాలి,  ముఖ్యమంత్రి గారు ?


అరటి, బత్తాయి, మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, కర్బూజ, వంటి ఉద్యానవన పంటలు రైతుల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.  మా తెనాలి చుట్టుపక్కల విరివిగా పండే పసుపు విక్రయ ధరలు కూడా ఎన్నడూ లేనంత తక్కువగా ఉన్నాయి.  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  ఆఖరి పసుపు కొమ్ము కూడా మంచి ధరకు కొనుగోలు చేసిన చరిత్ర మన కళ్ళ ముందే ఉంది.  పైన పేర్కొన్న పంటలన్నీ ఎక్కువ కాలం నిలువ ఉంచ కలిగేవి కావు. Perishable Goods  నిల్వ వుంచటానికి మనకేమో తగినన్ని శీతల గిడ్డంగులు లేవు.  మార్కెట్ కి వచ్చిన వెంటనే వ్యాపారులు,  ప్రభుత్వాలు కొనుగోలు చేయడం ఒక్కటే రైతులకు ఊపిరినిలిపే దారి.  ఆంధ్ర ప్రదేశ్ రైతు లోకానికి ముఖ్యమంత్రిగా మీరే చేయూతనిచ్చి నిజంగా నేనున్నానని అభయమిచ్చి అది ఆచరించి చూపించాలి.  రాజకీయాలను తాత్కాలికంగా పక్కన పెట్టి మీరు బాధ్యతగా వ్యవహరిం  చవలసిన అత్యంత క్లిష్టమైన కరోనా సందర్భమిది. కోతలు అయిపోయినాయి, వేసవి ముగిసింది, అయినా మనం రక్షించబడ లేదు. ఇక మీ విచక్షణ దే భారం.



ఈ లాక్ టోన్ దశ ముగిసిన తరువాత దేశ ఆర్థిక స్థితి ఏమిటి 90 శాతం వరకు ఆదాయం
పడిపోయిన రాష్ట్రాలు ఆర్దిక ఉపద్రవం సంగతి ఏమిటి అని మన ఆర్థిక నిపుణులు అప్పుడే
తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ దీనికి మినహాయింపు కాదని మనందరికీ తెలుసు.
వ్యవసాయ రంగమే మన ఆర్థిక రంగపు వెన్నుముక.  ఆ వెన్నుముక విరిగే ప్రమాదం ముంచు
కొచ్చింది,కొనుగోళ్లు లేక రైతులు తోటలలో,  రోడ్లమీద పారబోస్తున్న ఉద్యానవన పంటలు కరోనా    
లాక్ డౌన్లో  ప్రత్యేక చర్య గా ప్రజల రోగ నిరోధ క శక్తిని పెంచేందుకు కొనుగోలు చేసి. ఉచితంగా
నామమాత్రపు ధరతో యుద్ద ప్రాతిపదిక మీద పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవాలని మీ
ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. అలాగే మీరు శాసనసభలో కరతాళ ధ్వనుల మధ్య



రైతుల కోసం ప్రకటించిన 2,300 కోట్ల Input Subsidy ఏమైందో రాష్ట్ర రైతాంగానికి ఒకసారి
వినిపించ వలసిందిగా కోరుతూ్,  పోయిన వానా కాలపు వరదలు లో అల్లకల్లోలమైన రైతు
కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మీరు చేసిన ప్రకటన ఏ గాలివానకు కొట్టుకు
పోయిందో చెప్పాలని కూడా నోరులేని సన్నకారు మధ్యతరగతి రైతుల తరపున మీ
“సత్యమేవ జయతే” ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు బడ్జెట్లో ధరల స్థిరీకరణకు
కేటాయించిన మూడు వేల కోట్లని రైతల కోసం ఉపయోగించే అవకాశాన్ని తక్షణమే పరిశీలించి
ఆచరణ లోనికి తీసుకురావాలని కూడా నేను మీకు సూచిస్తున్నాను. ఉపద్రవ సందర్భం
నిర్వహణ నిధుల నుంచి కూడా మీరు రైతులను పలువిధాల ప్రయోజనాలను సమకూర్చు
వచ్చునని మీ కార్యాలయంలోని సమర్థవంతులైన అధికారులకు తెలియకుండా ఉండదు.


ప్రపంచ దేశాలలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతుండగానే,  ఆంధ్రప్రదేశ్ లో అదనంగా మళ్లీ
రైతుల ఆత్మహత్యలు చూడవలసి వస్తుందేమో నన్నశంఖ మావంటి వాస్తనిక  వాదులను
పీడిస్తోంది. ఒక రైతుబిడ్డగా నీరు కారుచున్న గుండెతో మరికొంత సానుకూలంగా మరికొంత
మానవీయ దృప్పధoతో రైతు సమస్యల పట్ల స్పందించాలని అధికార పీఠాన్ని,
మీ వ్యక్తిగత హృదయాన్ని కోరుతున్నాను.


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 24న రాష్ట్ర హైకోర్టు కి 600 మెట్రిక్ టన్నుల టమోటా, 6 నుంచి 7 వేల
టన్నుల అరటిని రైతుల నుంచి కొనుగోలు చేసిందని, 35 నియంత్రణ విభాగాలను ఏపర్పరిచిందని,
తద్వారా 700 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామనీ అంకెలు చెబుతూ కౌంటర్ దాఖలు చేస్తూ
విన్నవించారు. ఈది వాస్తవమే అనుకున్నా, ఈ చర్యలు కేవలం కంటితుడుపుకె తప్ప రైతుల పంటను
కొనుగోలుకు ఏమాత్రం సరిపోవని క్షేత్రస్థాయి వాస్తవాలు స్వయంగా పరిశీలించిన వాడిగా నేను
ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకి మీ రాజకీయ పుణ్యస్థలం గా భావించే కడప జిల్లాలోనే
తీసుకోండి,  మీరు నియమించిన పులివెందుల అభివృద్ధి కమిటీ బాధ్యులను అడిగి తెలుసుకోండి
కడప జిల్లా ప్రాంతంలో ఛీనీ, అరటి తోటలకు ప్రసిద్ధి.
రోజుకి రెండు వందల నుంచి 250  లారీలు అరటి మార్కెట్ లోని కోస్తయి. అరటికి టన్నుకి 3400/-
MSP, ఛీనీ టన్నుకి  14000/- MSP మద్దతు ధర ప్రకటించారు కానీ కొంటున్నది 15 నుంచి
20 లారీల వరకు మాత్రమే, భారీగా మిగిలిన పచ్చి సరుకు ఏమైపోవాలి.
ఆ రైతులు ఆర్థికంగా నాశనమై పోరా.


ఒక్క నెల్లూరు జిల్లాలోనే సుమారు 16 లక్షల టన్నుల ధాన్యంపండినదని అధికారులు
చెబుతున్నారు. ఎంత ధాన్యం మిల్లర్లు గానీ, ప్రభుత్వం గానీ కొనుగోలు చేసింది ఆ వివరాలు
ప్రభుత్వం కచ్చితంగావద్ద ఉన్నాయా ? 13 జిల్లాల అన్ని పంటల ఆ రైతుల ఆర్దిక ఘోష  
కరోనా భయం కంటే ఎక్కువగా వినబడుతున్న అన్నదాతల రోదన. ఉభయ గోదావరిజిల్లాలోని
రాష్ట్ర భాoడాగారంగా పిలువబడే అన్నపూర్ణకు మారుపేరు అయినటు వంటి ప్రాంతములో
పండిన పంటల పరిస్థితి ఒకసారి ఆలోచించండి.


వ్యవసాయదారులు  పాడిని, పశువులను నమ్ముకున్న వారు పడుతున్న నిత్య నిరంతర
శ్రమలను నిత్య అగచాట్లను మీరు దగ్గరగా చూడగలిగితే ఎవరు ఎవరిని  ఎలాపిండుకొంటున్నారో
మీకు విశదంగా అర్థమవుతుంది, అని మాబోటి వారి ఆశ. మీ మంత్రివర్గ సహచరులు దాదాపు
ప్రతిరోజూ రైతుల ఇబ్బందులను గురించి సమీక్షలు జరుపుతున్నట్లు ప్రకటించుకున్నారు,  
సంతోషమే కానీ చర్యలు లేని సమీక్షలు వలన, ప్రకటనల వలన,  ప్రయోజనం ఏముంది?  
రైతు అమ్మకానికి తెచ్చిన పంటని తగిన మద్దతుధర లభించేటట్లు గా చూడాలని అదీ కాకపోతే
రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంబంధిత శాఖలను మీరు ఆదేశించినట్లు వార్తలు
వచ్చాయి, వాస్తవంలో ఇది జరుగుతుందా ?


మీరు మీ ఆదేశాల ఆచరణ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నరా, క్షేత్రస్థాయిలో ఏమి
జరుగుతున్నదో మంత్రులు ,అధికారులను, గట్టిగా అడిగి తెలుసుకుంటున్నరా,  మీ ఆదేశాలు
అమలు జరుగుతున్నాయని రాష్ట్ర రైతాంగం గంపెడాశలతో ఉంది.



రైతుల పాటు మూడు చెరువులు ఆరుఎగుమతులుగా సాగుతూ వచ్చిన ఆక్వారంగం పరిస్థితి
కూడా అధ్వానంగా మారిన విషయం మీకు కూడా తెలుసు. ఆక్వా రైతులతో పాటు పౌల్ట్రీ, పాడి
పరిశ్రమ కూడా నాన్న కష్టాలు పడుతూ పడుతుంది. ఈ రైతాంగం అనుబంధ రంగాలనీ ఇప్పుడు
సహాయం కోసం మీ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాయి.
.


ముఖ్యమంత్రి పదవి అనేది ఏ దిగ్గజ కార్పొరేట్ కంపెనీ CMD లేక  CEO పదవి వంటిది కాదు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని కోట్ల మంది ప్రజల దైనందిక జీవన ప్రమాణాలని ప్రత్యక్షంగా ప్రభావితం
చేయగలడు, కావాల్సిందల్లా రాజకీయ సంకల్పం మాత్రమే. ప్రపంచంలో అన్ని శక్తుల కన్నా గొప్ప
శక్తి ధనశక్తి కాదు అది రాజకీయ అధికారం The greatest is not money power but political
power అన్నాడు ప్రసిద్ధ అమెరికన్ వ్యాపారవేత్త వాల్టర్  అనెన్ బెర్గ్. దీనికి ఇటీవల ఒక పని మీద
విశ్వ కుబేరుల్లో అగ్రశ్రేణిలో ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యక్తిగత విమానంలో ప్రత్యేకంగా వచ్చి
మిమ్మల్ని కలిసి వెళ్లడమే దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నంతవరకు మీరు చేయదలచుకున్న
ప్రజానుకూల చర్యలను ఎవరు నిలువరించడం సాధ్యం కాదు. మీరు పూను కొనడమే తరువాయి.



ఇట్లు
మీ శ్రేయోభిలాషి, విధేయ రాష్ట్ర పౌరుడు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు
ఆలపాటి రాజేంద్రప్రసాద్


Popular posts
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి