ప్రజలు* *అప్రమత్తంగా* *వ్యవహరించాలి* .. *ఎమ్మెల్సీ* *యలమంచిలి* *బాబు* *రాజేంద్రప్రసాద్*

*కరోనా వైరస్ పట్ల ప్రజలు* *అప్రమత్తంగా* *వ్యవహరించాలి* .. *ఎమ్మెల్సీ* *యలమంచిలి* *బాబు* *రాజేంద్రప్రసాద్*


ఉయ్యూరు టౌన్ 16 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు *ఈడేఅంజిబాబూ* *ఆధ్వర్యంలో* వార్డు ప్రజలకు కోడి గుడ్డులు,పాలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అదితి గా *రాజేంద్రప్రసాద్* గారు పాల్గొని ప్రజలకు కోడిగుడ్లు పాలు పంపిణీ ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంజి బాబు ప్రోటీన్ ఆహారము అయిన గుడ్డలు పాలు పంచడం అభినందనీయమని *రాజేంద్రప్రసాద్* అన్నారు.


కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని వైద్యులు సూచించే సలహాలను పాటించాలని,వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల శుభ్రత ప్రజలందరూ పాటించాలని *రాజేంద్రప్రసాద్* తెలిపారు.


ఈ కార్యక్రమంలో రాజులపాటి ఫణి కుమార్,అరేపల్లి సుబ్బారావు,చాలపాటి శ్రీనివాసరావు, జంపాన తేజా , హనుమాన్ నగర్ యూత్, కాటురు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు