చెంచు గూడాల ప్రజలను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి  :  ఐఎచ్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు

చెంచు గూడాల ప్రజలను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
   ఐఎచ్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు
గుంటూరు ఏప్రిల్ 25 :రాష్ట్రం లో మానవత్వం మంట కలిసి పోతుందని పేద అణగారిన వర్గాల ప్రజలను ఆదుకొనే నాదుడు కరువైనారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం (ఐఎచ్ఆర్ఏ)ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు ఆన్ధోలన వ్యక్తం చేశారు.కోవిస్-19, (కరోనా) నేపద్యం లో రాష్ట్రం లో పేదప్రజలు తల్లడిల్లి పోతున్నారని,వారికి సరైన సౌకర్యాలు కల్పించడమ్ లో ప్రభుత్వం విఫలమైందని  ఆయన ఆరోపించారు.రెక్కాడితే గాని డొక్కాడని గుంటూరు జిల్లా వెల్దుర్ది మండలం చెంచు గూడెం  ప్రజలు కరోనా మూలంగా అర్ధకలి తో అలమటిస్తున్నారని తిరుపతి నాయుడు తెలిపారు.ఇలాంటి గూడెంలు,తండాలు రాష్ట్రం లో అనేకం ఉన్నాయని అక్కడి ప్రజల పరిస్తితి కూడా ఇలాగే  ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు.లాక్ డౌన్ నేపద్యం లో ప్రభుత్వం పేద ప్రజల కోసం 1000 రూపాయల నగదు  5 కే.జిల  బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు ఇట్టి పతకం ఈ ప్రాంత ప్రజలకు అందక పోవడం శోచనీయమన్నారు.పాటశాలలు ,హస్తల్స్ మూసివేయడం మూలంగా పిల్లలు ఇళ్ల వద్దే ఉండటం మూలంగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదని,కనీసం పట్టణాలకు  వెళ్ళి కొందామన్న కరోన మూలంగా వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా వారికి ఒక వైపు ఉపాడి పనులు లేవు,మరోవైపు పొలం పనులు లేకపోవడం తో చేతిలో డబ్బులు లేక అనేకా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వెంటనే ఈ ప్రాంతాల ప్రజలకు 1000 రూపాయలు, 5 కే.జి ల బియ్యం అందించాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు,ఇట్టి విషయాన్ని అధికారుల  దృస్టికి తెసుకెల్తే వారు కరోనా ఉంది మేము వెళ్లలేము అన్న నిర్లక్ష సమాదానం ఇస్తున్నారని తెలిపారు.పేదల విషయంలో వెంటనే ముఖ్య మంత్రి జగన్ మోహాన్ రెడ్డి స్పందించి వారిని ఆదుకోవాలని తిరుపతి నాయుడు కోరారు.ఈ మేరకు గురజాల ఆర్డిఓ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.