కరోనా రోగుల కోసం రోబోను  నెల్లూరు  జిల్లాకు అందజేసిన నిజాముద్దీన్

కరోనా రోగుల కోసం రోబోను 
 జిల్లాకు అందజేసిన నిజాముద్దీన్



     నెల్లూరు ;   నెల్లూరు ఎంపీ ఆ దాల ప్రభాకర్ రెడ్డి  ఆదేశాల మేరకు కరానా రోగుల కోసం కోవిడ్- 19 రోబోను సయ్యద్ నిజాముద్దీన్, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబుకు అందజేశారు. నెల్లూరు న్యూ జెడ్పీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ నిజాముద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరికమేరకు ఈ రోబోను తన మేనల్లుడు సయ్యద్ పర్వేజ్తో తయారు చేయించానని చెప్పారు. లక్షలాది రూపాయల విలువ చేసే ఈ రోబో అందించే సేవలు అమూల్యమైనవని తెలిపారు. దీన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పని చేయించవచ్చునని తెలిపారు. కరోన వైరస్ రోగుల దగ్గరికి డాక్టర్లు వెళ్లకుండానే మందులు, ఇతర సామగ్రిని ఈ రోబో  ద్వారా అందజేయ వచ్చునని  చెప్పారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రోగి రోబో ముందు చెబితే డాక్టర్లు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చునన్నారు. అలాగే వారు దూరం నుంచే రోబో ద్వారా రోగులకు సూచనలు సలహాలు దృశ్య మాధ్యమం ద్వారా అంద చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు. రోబో పని తీరును చూసిన జిల్లా కలెక్టర్ ఇటువంటివి మరో నాలుగు రోబోలు జిల్లాకు అవసరమవుతాయని, వాటిని రూపొందించి ఇవ్వమని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రోబో పనితీరును నిజాముద్దీన్ ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ పర్యవేక్షణ ప్రత్యేకాధికారి రామ్ గోపాల్  పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తన ప్రశంసలను తెలిపారు. రోబో రూపశిల్పి సయ్యద్ పర్వేజ్ కూడా పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image