ముఖ్యమంత్రి కి వచ్చిన విరాళాల వివరాలు

     విజయవాడ, తేదీ.09.(అంతిమ తీర్పు):
ముఖ్యమంత్రి సహాయ నిధి (కోవిడ్-19) కి ఏప్రిల్ 9 వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు 11,839 మంది దాతలు రూ. 133 కోట్ల 6 లక్షల 65  వేల 477 ల విరాళాలు అందజేశారని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ మెంబర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల పైబడి 11 మంది దాతలు రూ. 65,37,00,000 లు, విరాళంగా అందించగా, కోటి నుంచి 5 కోట్ల రూపాయల వరకు 23 మంది రూ. 34,87,12,115 లు, 10 లక్షల పైన కోటి రూపాయల లోపు 42 మంది రూ.10,56,91,763 లు, లక్ష పైన 10 లక్షలలోపు 213 మంది రూ. 4,21,71,044 లు, 20 వేల నుండి 50 వేల వరకు 263 మంది రూ. 63,40,958 లు, 20 వేల లోపు 11,160 మంది రూ. 16,74,61,193 ల సాయం అందించారన్నారు.   
కరోనా ఆర్థిక సాయంలో భాగస్వాములు కావాలసిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంధ్రప్రదేశ్ పేరున తమ చెక్కులను పంపాలని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకునేవారు SBI ACCOUNT NO - 38588079208, IFSC CODE - SBIN0018884, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి మరియు ANDHRA BANK ACCOUNT NO : 110310100029039, IFSC CODE – ANDB003079, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి ఖాతాలలో జమచేయాలన్నారు. వెబ్ సైట్ ద్వారా విరాళాలు అందించాలనుకునే వారు apcmrf.ap.gov.in కు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించాలని ఆయన కోరారు. 
విరాళాలు చెక్కుల రూపంలో మరియు ఆన్ లైన్ లో అందించే దాతలు తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈ –మెయిల్ అడ్రస్ తో పాటు ఎందు నిమిత్తం విరాళం అందిస్తున్నారో తెలియజేస్తూ, చెక్కులు ఇతర ఆన్ లైన్ వివరాలను, ప్రత్యేక అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి,ఈ-మెయిల్: splofficer-cm@ap.gov.in కి అందజేయగలరని ఆయన  తెలియజేశారు. 
వెబ్ సైట్ ద్వారా విరాళాలు ఇచ్చిన దాతలు గౌరవ ముఖ్యమంత్రి లేఖ, రసీదు,100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు పత్రాన్ని అదే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమీషనర్ తెలిపారు. .


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..