కరోనా వైరస్ నియంత్రణ దిశగా కృషి చేయాలి

కరోనా వైరస్ నియంత్రణ దిశగా కృషి చేయాలి


వింజమూరు, ఏప్రిల్ 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి):  అధికారులందరూ కూడా కరోనా వైరస్ నియంత్రణ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్.పి భాస్కర్ భూషన్, జె.సి వినోద్ కుమార్ లు సూచించారు. బుధవారం నాడు వింజమూరు తహసిల్ధారు కార్యాలయంలో జిల్లా కేంద్రం నుండి నిర్వహించిన వీడియో కాన్ ఫరెన్స్ నందు మండల స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కరోనా వైరస్ ఉధృతిని పరిగణనలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మండలాలను విభజించడం జరిగిందన్నారు. వైరస్ నివారణలో భాగంగా పలు ప్రాంతాలలో స్వల్పంగా ఆం క్షలు సడలించినప్పటికీ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా అమలులో ఉంటాయన్నారు. గ్రీన్ జోన్ ప్రాంతాలలో కొంతమేర వెసులుబాటు చర్యలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాలతో పాటు ప్రజా జీవనానికి అవసరమైన వాటికి కొంతమేర ఊరట లభించే దిశగా ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకు సాగనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్ధారు సుధాకర్ రావు, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, ఎస్.ఐ బాజిరెడ్డి, మండల వ్యవసాయాధికారి కిషోర్ బాబు, జల వనరుల శాఖ ఏ.ఇ వైష్ణవి లు పాల్గొన్నారు.