కరోనా లాక్ డౌన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు :సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతి ఏప్రిల్ 25, (అంతిమ తీర్పు,):


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.


కరోనా లాక్ డౌన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.


పండ్ల తోటల రైతులకు రవాణా సౌకర్యం, మార్కెటింగ్ సౌకర్యం లేక పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు.


అప్పులు తెచ్చి పంట వేసిన ఆక్వా, మొక్కజొన్న, అరటి, చీని రైతులు లబోదిబోమంటున్నారు.


అనంతపురం, కడప ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని పర్యటింప చేయండి.


రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే నిర్దిష్ట చర్యలు చేపట్టండి.
- రామకృష్ణ.