ఇర్ఫాన్ ఖాన్ మరణం సినీరంగానికి తీరని లోటు  ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి


ఇర్ఫాన్ ఖాన్ మరణం సినీరంగానికి తీరని లోటు
 ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి
 
విజయవాడ, ఏప్రిల్ 29:  బాలీవుడ్ విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్ మరణం చలన చిత్ర రంగానికి తీరని లోటని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇర్పాన్ ఖాన్ 1988 లో సలాం బాంబే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనన్నలు అతిస్వల్పవ్యవధిలోనే పొందిన గొప్పనటునని ప్రశంసించారు. తెలుగులో నిర్మించిన  సైనికుడు సినిమాలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల మనన్నలు పొందిన విలక్షణ నటుడని, ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమతో ఆయన అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారన్నారు. ఎంతో విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్  మృతికి ఎఫ్.డి.సి. ఎం.డి. శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ  సానుభూతి వ్యక్తం చేశారు.