మానవతా దృక్పధంతో స్వచ్చంద సంస్థలు, ట్రస్ట్ లు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి. యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్
ఉయ్యురు : నగర పంచాయతి 3 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు యం జి రవి, అజ్మతుల్లా ఆధ్వర్యంలో యం జి శోభ పర్యవేక్షణలో 570 కుటుంబాలకు ఇంటింటికి కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించి నెల రోజులు కావస్తుందని, ఉపాధి లేక పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయానీయంగా మారిందని, మానవతా దృక్పధంతో స్వచ్చంద సంస్థలు, ట్రస్ట్ లు ముందుకొచ్చి వీళ్ళని మన కుటుంబంలాగే భావించి ఆదుకోవాలని రాజేంద్ర ప్రసాద్. అన్నారు.అలాగే 3 వార్డులో కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంపిణి చేస్తున్న రవి, బాబూ, గఫుర్, సురేష్ ని అభినందించిన రాజేంద్ర ప్రసాద్.
ఈ కార్యక్రమంలో ఉయ్యురు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, తెలుగుదేశం పార్టీ నాయకులు చేదుర్తిపాటి ప్రవీణ్, జంపన వీర శ్రీనివాస్, 3వార్డ్ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.