శ్రీకాళహస్తిలో ఇళ్లవద్దకే నిత్యావసర వస్తువులు పంపుతున్నాము : చిత్తూరు కలెక్టర్

,ఏప్రిల్ 29...      చిత్తూరు  జిల్లాలో    ఎక్కువ కేసులు నమోదవుతున్న శ్రీకాళహస్తి పట్టణములో కంటైన్మెంట్ జోన్ చేశామని మొత్తం 14 వార్డులలో పాజిటివ్ కేసులు నమోదు అవడం వల్ల మొత్తం 35 వార్డులను  రెడ్ జోన్ లుగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి కి చెప్పారు.బుధవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఇళ్లవద్దకే నిత్యావసర వస్తువులు పంపుతున్నామని ఇందులో 10 మంది వ్యాపారస్తులకు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని అదే విధంగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి,తిరుపతి లోని రుయా ఆస్పత్రిని కోవిద్ ఆస్పత్రులుగా మార్చడం వల్ల ఔట్ పేషెంట్ విభాగం పని చేయడం లేదని ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సి ఉందని అన్నారు.శ్రీకాళహస్తిలో రోజి 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా సెకండ్ కాంటాక్టులను గుర్తిస్తున్నామని అన్నారు.కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి జిల్లాకు 500 జ్వరం కు సంబంధించి చెక్ చేయడానికి ధర్మామీటర్లను  పంపిణీ చేస్తామని అలాగే కోవిద్ ఆస్పత్రులు కాకుండా రెగులర్  పేషెంట్ల కోసం ఏర్పాటు చేస్తామన్నారు.ఆస్పత్రులలో కావాల్సిన ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయో చూసుకొని ఎవరైతే రోగి వస్తాడో వారికి అన్ని వస్తువులు ఉండేటట్లు చూడాలని అన్నారు.ఇవన్నీ మే 5 లోపున ఉండేటట్లు చూసుకోవాలని అన్నారు.ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటామని అంటారో వారికి టేలిమెడిసిన్ పై అవగాహన కల్పించాలన్నారు.అదేవిధంగా వారి ఇంట్లో చిన్న పిల్లలు లేకుండా చేసుకోవడంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కు లివింగ్ స్పేస్ ఉండాలని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.ర్యాపిడ్ టెస్టులను మరింతగా చేయాలన్నారు.డిశ్చార్జ్ చేసేటపుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇతర వ్యాధిగ్రస్థులపై కూడా శ్రద్ధ చూపాలని అన్నారు.వ్యాధిగ్రస్తులు కు పెట్టె ఖర్చులలో నిదులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు ప్రైవేట్ ఆస్పత్రులవారు ఏమెర్జెన్సీ కేసులు చూసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కోరారు.వారు కరోనా తో సంభందించిన కేసులు కాకుండా ఇతర కేసులు చూస్తారని కార్యదర్శి గిరిజాశంకర్  అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తో పాటు జె సి2 చంద్రమౌళి,జిల్లా వైద్యాధికారి పెంచలయ్య,డాక్టర్ జయరాజ్,సరలమ్మ,నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image